సంగీత జ్ఞానం ;- కొప్పరపు తాయారు

 శ్యామశాస్త్రి గారు తెలుగు సంస్కృతం భాషల లో పండితులు మేనమామ వద్ద సంగీతం ప్రారంభ దశలో పాటలు నేర్చుకున్నారు 
         వీరు 18 ఏటా తంజావూర్ అమ్మానాన్నలతో చేరుకున్నారు. ఆంధ్ర పండితులైన సంగీత స్వామి అను సన్యాసి కాశీ నుండి దక్షిణ హిందూ యాత్రకు వచ్చి చాతుర్మాసము అవ్వడం వలన తంజావూర్ లోని నాలుగు నెలలు ఉండిపోయారు 
      ఒకరోజు శ్యామశాస్త్రిగారి ఇంటికి వారు బిక్షకై వెళ్లారు. బిక్ష ముగించుకున్న తర్వాత శాస్త్రి గారి తండ్రి తన కుమారుని ఆ సన్యాసి గారికి చూపి ఆశీర్వదించమనగా.
         వెంటనే శ్యామశాస్త్రి గారిని చూసి గొప్ప పండితుడు అవుతాడని చెప్పారు 
           అప్పటినుండి సంగీత విద్యని  అభ్యసించెను తాళ శాస్త్రంలోనూ  రాగ శాస్త్రంలోనూ  అఖండమైనటువంటి పాండిత్యం కలిగి ఉన్న శ్రీ సంగీత స్వామి వద్ద బాగుగా విద్యనభ్యసించెను.
       సంగీత స్వామి చాతురమాసం దీక్ష తీరగానే వెళ్ళిపోతున్నప్పుడు గాంధర్వ విద్యా గ్రంథములు శ్యామశాస్త్రిగారికి ఇచ్చి నీవు సంగీతంలో శాస్త్రంలో అభ్యసించిమంచి పాండిత్యం పొందావు.కానీ తంజావూర్ ఆస్థాన విద్వాంసుడు అయినటువంటి పచ్చిమిరియం ఆది అప్పయ్య గారి సంగీతమును విను అని చెప్పిరి .
      గురువుగారు చెప్పినట్టే ఆది అప్పయ్య గారితో స్నేహబంధం పెంచుకున్నారు ఆయనకు శాస్త్రి గారు అంటే అమితమైన ప్రేమ తో శాస్త్రి గారిని కామాక్షి అని  పిలుచుకునేవారు..

కామెంట్‌లు