శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు 
================
36.
సత్త్వ గుణముల వేడితి సరగునిడుమ!
కామమదములన్ దూలింపు కంబుకంఠ!
నీవు చెప్పెడి బోధలు నేను వినెద 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
37.
దిక్కు నీవని యెంచితి దీనబంధు!
ప్రక్క నండగ నీవుండ భయము లేదు 
చుట్ట రికమును గోరితి జూపవయ్య!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
38.
కూరిపోతినీ తామస కూపమందు 
తలనువాల్చితి నో దేవ దప్పికొంటి 
వెదుకు చుంటిని తెలియని వెలుగు దారి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
39.
వేసటంతయు తొలగింపు వేదవేద్య!
తరచి చూడగ నీవంటి దైవమెచట 
కాన రాడని కనుగొంటి ఘనముగాను 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
40.
పిల్ల పాపల రక్షింపు పేర్మితోడ 
నాదు భారంబు నీదని నమ్మి యుంటి 
పలుకు తోడుగ రావయ్య పద్మనాభ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు