శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
641)అమిత విక్రమః -

విశేష పరాక్రమమున్నవాడు 
విజేతగానే నిలిచినవాడు 
అమిత విక్రమ నామధేయుడు 
భక్తులకు అభయమిచ్చువాడు శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
642)కాలనేమి నిహా-

కాలనేమిని సంహరించినవాడు 
అసురగణముల నణుచువాడు 
తామసుల నంగీకరించనివాడు 
దైత్యతత్వం తొలగించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
643)వీరః -

వీరత్వమును కలిగినవాడు 
సదా విజయమందుచున్న వాడు 
వైరులను నశింపజేయువాడు 
క్షత్రియతత్వమున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
644)శౌరీః -

శూరవంశమున పుట్టినవాడు 
శౌర్యమును ప్రదర్శించువాడు 
శౌరి నామముగలిగినవాడు 
సన్నిథిలో నిర్భయమునిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
645)శూర జనేశ్వరః -

శూరులకు ప్రభువైయున్నవాడు 
వీరత్వమును కలిగినవాడు 
సమూహమంతటిలో వీరుడు 
ధీరజనులకు సర్వేశ్వరుడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు