శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )--ఎం. వి. ఉమాదేవి
671)-మహాక్రమః -

మంచిపధ్ధతి గలిగినవాడు 
క్రమశిక్షణ సహితమైనవాడు 
క్రమపద్ధతిలో నడుచువాడు 
క్రమమునెపుడు తప్పనట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
672)మహా కర్మా -

ఘనమైనట్టి కర్మలు చేయువాడు 
గొప్పపనులు ఆచరించువాడు 
అద్భుత విధివిధానమున్నవాడు 
తిరుగులేనట్టి సాధనున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
673)మహాతేజా -

గొప్ప తేజస్సుగలిగినవాడు 
కాంతిరేఖావలయమున్నవాడు 
దివ్యత్వము నిండియున్నవాడు 
సూర్యచంద్రవెలుగులున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
674)మహోరగ -

గొప్ప సర్పస్వరూపముగలవాడు 
ఆదిశేషుని యంశనున్నవాడు 
భూమినిభరించుచున్నవాడు 
అద్భుతమైనట్టి సర్పరూపుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
675)మహాక్రతుః -

గొప్పయజ్ఞ స్వరూపుడైనవాడు 
యాగములందు పాల్గొనుచున్నవాడు 
వైదికకర్మలు ఆచరించువాడు 
హవిస్సులు స్వీకరించునట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు