:పల్లెలోనే ప్రశాంతత;- అక్కి నర్సింలు గౌడ్ - రంగారెడ్డి జిల్లా
ధర్మన్న కళాపీఠం 
-----------------
అమ్మా!నను గన్న నా తల్లీ
పల్లెలోనే పంటలు పండును
పల్లెలో ప్రశాంతత ఉండును
పల్లె జీవితం ఎంతో బాగుండు

పచ్చ పచ్చని వృక్షాలు పెంచి
దేశ ప్రగతికి బాటలు వేస్తా
సేంద్రియ ఎరువులు వేసియే
పంటలు పండించి చూపిస్తా

భారతమాతకు రైతుబిడ్డగా
ఉండి నేను గర్వంగా ఉంటా
హానికరం గాని పంటలనే పండిస్తా
హాయిగ రైతునై నేను జీవిస్తా

అందరు విదేశాలకు వెళ్ళితే
దేశ ప్రగతి ఎలా జరుగుతుంది
ప్రభుత్వం ఇంత ఖర్చు చేసియే
చదివిస్తే ,విదేశాలకు వెళ్ళితే ఎలా?

అందరు ఉద్యోగాలంటే మరి
వ్యవసాయం చేసేవారెవరు 
రేపటి మన భారత దేశపు
భవిత‌ ఏమౌతుందో యోచించండి
********

     

కామెంట్‌లు