పదోతరగతి బాలికలకు డా.నీరజారాణి పురస్కారాలు.

 రాజాం పరిసరాల్లో గల పది మండలాలకు చెందిన పదోతరగతి బాలికలకు డా.యడ్ల నీరజా రాణి పురస్కారాలను బహూకరించామని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యడ్ల నీరజారాణి తెలిపారు. గతనెల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో 540 మార్కుల పైబడి సాధించిన 
ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆమె తెలిపారు. 
డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో 
హాజరైన 110 మంది బాలికలకు ప్రత్యేక ప్రతిభా పరీక్షలను విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సామంతుల సింహాద్రినాయుడు పర్యవేక్షణలో నిర్వహించి, మొదటి పది స్థానాల్లో నిలిచిన బాలికలకు ఈ పురస్కారాలను అందజేయడమైనది. 
వీరిలో ప్రథమ స్థానంలో సిరిపురం పాఠశాల విద్యార్థిణి అక్కలపోతు వాహినికి రు.25,000/- నగదు పారితోషికం, ద్వితీయ స్థానంలో నిలిచిన అరసాడ పాఠశాలకు చెందిన కొరటాన త్రివేణి కి రు.15,000/- నగదు పారితోషికం, తృతీయ స్థానంలో నిలిచిన వాల్తేరు పాఠశాలకు చెందిన సింగిపురపు హారికకు రు.10,000/- నగదు పారితోషికాలతో పాటు జ్ఞాపికలను డా.సామంతుల కిరణ్ కుమార్, డా.వై.నీరజారాణి, డా.ఎస్.శరత్ కుమార్, డా.ఎం.సౌజన్య, డా.ప్రతిమ,  డా.సవిరిగాన సురేష్ కుమార్, డా.అశ్విని, డా.తేజశ్విని ల చేతులమీదుగా పురస్కార ప్రదానం జరిగింది. ఈ ప్రతిభా పరీక్షలో తొలి పది స్థానాల్లో నిలిచిన 
ఎ.వాహిని సిరిపురం, కె.త్రివేణి అరసాడ, ఎస్.హారిక వాల్తేరు, డి.తేజస్విని అంబకండి, టి.లాస్య రాజాం, పి.రమ్య సిరిపురం, ఎ.శ్రావణి డోలపేట, ఎ.జ్యోత్స్న డోలపేట, బి.ఝాన్సీ పాలకొండ, డి.తేజ పాలకొండలకు జ్ఞాపిక, మెడల్స్ తో పురస్కార ప్రదానాలు జరిగాయి. వీరికి సభాధ్యక్షులు ఆర్.వి.జి.ఎన్. మురళీకృష్ణ, అతిథులు శాసపు సత్యనారాయణ, ఎ.జగదీశ్వరి, ఉరిటి వాసుదేవరావు, ఆర్.వి.జె.నాయుడు, లావేటి గోవిందరావు, ఈసర్ల మురళీకృష్ణ, కుదమ తిరుమలరావు, సత్యంనాయుడు, జి.వెంకటరమణ,  కె.పురుషోత్తం, జి.భరత్, రావాడ సులోచన ల చేతులమీదుగా ఈ పురస్కార ప్రదానాలు జరిగాయి.
ఇదే వేదికపై నేడు హాజరైన బాలికలలో అత్యధిక మార్కులు 585 సాధించిన చింత నవ్యశ్రీ పొగిరి, పాలవలస యామిని వంగర, కె.ఝాన్సీరాణి పాలకొండ, జి.ఉష మందరాడ, ఎ.శ్రావణి డోలపేట లకు, ఎం.బి.బి.ఎస్.లో ఎంపికైన డోలపేట విద్యార్ధిణి గుడ్ల హాసినిలకు శాలువా, జ్ఞాపికలను నిర్వాహకురాలు డా.యడ్ల నీరజారాణి చేతులమీదుగా బహూకరించారు. హాజరైన 110 మందికీ నోట్ బుక్స్, పెన్స్ లను బహూకరించారు.
బాలికా విద్యను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కామెంట్‌లు
Esarla MuraliKrishna చెప్పారు…
👏🌹💐 ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినులను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది