శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
661)బ్రాహ్మణ్యః -

బ్రహ్మను అభిమానించువాడు 
ధర్మాచరణ సాధనమైనవాడు 
బ్రాహ్మణ సమూహమందున్నవాడు 
బ్రాహ్మణ కర్మలను చేయువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
662)బ్రహ్మకృత్ -

తపస్సును ఆచరించగలవాడు 
బ్రహ్మముకు కర్తయైయున్నవాడు 
ధ్యానాదులను జరిపించువాడు 
తపోవృద్ధికి కారణమైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
663)బ్రహ్మా -

బ్రహ్మదేవుని రూపంలోనున్నవాడు 
సృష్టిని తనే సృజించుచున్నవాడు 
ప్రాణులను పుట్టించినట్టి వాడు 
భువనములు ఏర్పరిచినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
664)బ్రహ్మః -

అమోఘమైన తేజ మున్నట్టివాడు 
బ్రహ్మాండము తనైయున్నవాడు 
గొప్పదైన గుర్తింపుగలవాడు 
బ్రహ్మ స్థానములో యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
665)బ్రహ్మ వివర్థనః -

గొప్ప తపస్సున్నట్టివాడు 
యోగము వృద్ధిచేయగలవాడు 
ధ్యానము పెంపొందించువాడు 
బ్రహ్మవివర్ధనుడైనట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు