వింతలు విడ్డూరాలు-;-అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రాచీన కాలంలో నావికులు తెగభయపడేవారు ఎలాంటి ఆపదలు సమస్యలు వస్తాయో అని.సముద్ర ప్రయాణం లో వింత అనుభవాలు సముద్ర రాక్షసులు కన్పడ్డారని చెప్పేవారు జనాలకి.మనాటీ అనే చేపసగం స్త్రీ గా సగం చేప ఆకారంలో కన్పడింది అని చెప్పారు.నావికులు వాటిని మెర్మెయిడ్స్ అనేవారు.ఆచేపస్త్రీ మత్స్యకన్య హాయిగా పాడుతూ నావికులను ఆకర్షించి వారి నావల్ని బోల్తా కొట్టించి నాశనం చేసేవి.
యు.ఎస్.కెనడా సరిహద్దుల్లో బోలెడన్ని రాక్షసజీవులుండేవని జనం నమ్మేవారు. పాములాంటిప్రాణి మూడున్నర మీటర్ల పొడవుతో పైకి కిందకీ సాగుతూ లేక్ ఒన్టారియో లో కనపడింది.వీటికి తమాషా గా రెడ్ ఇండియన్ పేర్లు పెట్టారు.ఒగోపొగో అలాంటి పేరు.సరస్సుల చరిత్ర అంతా దెయ్యాలనౌకలు  లైట్ హౌస్లు సీ.. మాన్స్టర్స్ వాటర్ స్పిరిట్స్ తో నిండినవే🌸
కామెంట్‌లు