శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
786)ఇంద్రకర్మా -

ఇంద్రునివలే కార్యపురుషుడు 
శుభములు చేయుచున్నవాడు 
దేవకార్యముల మూలమైనవాడు 
ఇంద్రసామర్థ్యం గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
787)మహాకర్మా -

గొప్పపనులను చేయుచున్నవాడు 
ఘన కృత్యాలను చేయువాడు 
మంచికర్మాచరణ యున్నవాడు 
మహాకర్మ నామమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
788)కృతకర్మా -

ఆచరణ యోగ్యతగలవాడు 
కార్యాచరణ సమర్థతున్న వాడు 
కృతకృత్యుడై యుండినవాడు 
కర్మను అనుసరించినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
789)కృతాగమః -

వేదములను అందించువాడు 
యజ్ఞంలో యేతెoచినవాడు 
కృతాగముడైనట్టి వాడు 
కార్యక్రమము నడుపువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
790)ఉద్భవః -

ఉత్కృష్టమైన జన్మగలవాడు 
చక్కని పుట్టుకయున్నట్టివాడు 
దివ్యముగా ఉద్భవించినవాడు 
కారణజన్ముడు అయినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు