ఎంత ముద్దుగున్నదీ ఈ పిట్టా!;- జి.యాదయ్య
 ఎంత ముద్దుగున్నదీ ఈ పిట్టా!
ఎంత ముద్దుగున్నదీ దీని పొట్టా!
ఎంత ముద్దుగున్నదీ  దీని తోకా !
ఆడి పెట్టు తున్నదీ పెద్ద కేకా!
ఎంత ముద్దుగున్నవీ దీని చూపులూ..
ఎంత ముద్దుగున్నవీ దీని పాపలూ..
ఎంత ముద్దుగున్నవీ దీని 
ఆటలూ...
ఎంత ముద్దుగున్నవీ దీని 
పాటలూ...
ఎంత చక్కగున్నవీ దీని
రెక్కలూ....
ఎంత చక్కగున్నవీ దీని
ముక్కులూ.....
ఎంత ముద్దుగున్నవీ దీని 
ఈకెలూ....
ఎంత ముద్దుగున్నవీ దీని 
కేకలూ....
ఆడి - పాడుతుంటవీ 
పొద్దు గూకులూ....
ఎగిరి తిరుగుతుంటవీ 
ఎల్ల వేళలా..
ఆడి- మురుసుతుంటవీ 
అన్ని వేళలా...
------------------------
( రచయిత: "ఉయ్యాల- జంపాల"
పిల్లల పద్యాలూ, పాటల పుస్తకం

కామెంట్‌లు