ఆభరణబ్రహ్మ- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కాలపరీక్షను ఎదుర్కొని
నిలువెత్తు నమ్మకంలా నిలబడినవారు
ముద్దగాఉన్న లోహాన్ని
ఒక కళాఖండంలా తీర్చిదిద్దేవారు
అతివల అందాలకు తోడునీడలను కల్పించేవారు
స్వర్ణ శకలాలతో ప్రతిసృష్టిచేసి
అద్భుత స్వర్ణాభరణాలను ఆవిష్కరింపజేసేవారు
బంగారుతీగలను అల్లి 
చక్కని భూషణాలుగా మార్చేవారు
వజ్రం, వైఢూర్యం,మరకతం, మాణిక్యం,
ముత్యం,పగడం, గోమేధికం, పుష్యరాగం
వీరి చేతుల్లో ఒదిగిపోయి
ఏడువారాల పసిడినగల మధ్యలో వగలుపోతాయి
తలవెంట్రుకలనుండి పాదాలవ్రేళ్ళవరకు
శరీరపు ప్రతి అవయవానికీ వన్నెతెచ్చేలా
పదారువన్నెల పసిడిఆభరణాలు కూర్చేవారు
కొట్టి కొట్టి, రాసి రాసి,గీకి గీకి,వంచి వంచి
పసిడిముద్దను విలక్షణ మంగళకర
ఆభరణంగా ఉసురుపోసే మీరు
అపర " ఆభరణబ్రహ్మలు " సుమా!
మీ హస్తకళా నైపుణ్యానికి నా అక్షరనీరాజనాలు !!
**************************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి శీర్షికతో కవిత బాగుంది సార్. అభినందనలు 👏👏శుభాకాంక్షలు 🌹🙏🌹
Ramakrishna Patnaik చెప్పారు…
అభినందనలు! శ్రీ గౌరవరాజు సతీష్ కుమార్ గారికి!

-రామతాత.
Ramakrishna Patnaik చెప్పారు…
అభినందనలు! శ్రీ గౌరవరాజు సతీష్ కుమార్ గారికి!

-రామతాత.