లిబరలైజేషన్
ప్రైవేటైజేషన్
గ్లోబలైజేషన్
(LPG)
ఇవి ఎవడి ప్రయోజనాలకోసం
బడా పారిశ్రామిక వేత్తలకు
దోచి పెట్టడానికే గదా
స్కూల్లు కాలేజీలు
హాస్పిటల్స్ కోర్టులో న్యాయం
వీటన్నింటినీ ప్రైవేటు పరం చేసి
నాణ్యమైన విద్య లేదు
ఉచిత వైద్యం లేదు
కబ్జా కోరల్లో చిక్కుకున్న
భూతల్లి చెరవిడిపించాలంటే
పేదోడికి కోర్టులో న్యాయం దక్కదు
అన్ని వ్యవస్థలను గుత్తాధిపత్యం వహించింది
పెట్టుబడిదారులే
ఈ పెట్టుబడి దారులే
పొలిటికల్ పార్టీలకు ఎన్నికల
ఫండింగ్ సమకూర్చడం
తద్వారా
గెలిచిన పార్టీలు
పెట్టుబడిదారుల కనుసన్నల్లో
పాలనకొనసాగించడం
అసంఘటిత రంగ కార్మికులు
శ్రమదోపిడికి గురికావడం
మధ్యతరగతి పేదవర్గీయులు
ఉపాధి లేక,
బ్రతుకుభారమై
తమ ఈ పరిస్థితికి కారణం
ఎదిరించలేక
తమ కర్మగ్రహచారమంటూ
ఆశలు ఆకాంక్షలు చంపుకొని
ఆత్మవిశ్వాసం కోల్పోయి
వారి బ్రతుకుల్లో వెలుగు
కోసమై ఎదురు చూస్తూ ---
చూసారా---?!
వ్యవస్థ, వ్యక్తులు, అన్నీ
పసిడిగలిగినోడు
బానిసలుగా చేసుకున్న వైనం
మానవ మనుగడిప్పుడు
తిరోగమనమా !?
పురోగమనమా!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి