రాకేష్ కుక్కపిల్ల;- కె.ఉషశ్రీ -10వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. సత్తయ్య ,సరిత ఉండేవారు. వాళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. రాకేష్, బడికి వెళ్తాడు. వాళ్ల అమ్మ ,నాన్న బడిలో అన్నం వండి పిల్లలకు పెడుతారు. రాకేష్ బడికి వెళ్లి బాగా చదువుకుంటాడు. ఆదివారం రోజు అలా బయటకు వెళ్లి ఆడుకుంటాడు. కొద్దిసేపటికి చిన్న కుక్క పిల్లకు కాలుకు దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అప్పుడు రాకేష్ అది చూసి కుక్క పిల్ల దగ్గరకు వెళ్లి కుక్క పిల్లకు మందులు వేసి కట్టు కట్టిండు. కుక్క పిల్లను ఇంటికి తీసుక వెళ్తాడు. కుక్క పిల్లకు పాలు, అన్నం బిస్కెట్లు, మందులు వేసుకుంటూ బడికి వెళ్తాడు. అలా వారం తరువాత కుక్కపిల్లకు దెబ్బ తగ్గిపోయింది. రాకేష్ చాలా ఆనందంగా ఉంటాడు. సాయంత్రం బడి నుండి రాగానే ఒక పిల్లతో ఆడుకుంటాడు. కొన్ని సంవత్సరాలకు కుక్క పిల్ల పెద్దగా అయ్యింది. రోజు రాకేష్ తోనే బడికి వెళ్తుంది. రాకేష్ వాళ్ల అమ్మ, నాన్న కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు.
నీతి, ఆపదలో ఉన్న జంతువులను కాపాడే బాధ్యత మనది. రాకేష్ లాగా మంచి ఆహారం, మందులు వేసి ప్రేమగా చూసుకోవాలి. కుక్క పిల్లని పెంచి పెద్ద చేయాలి. దొంగల బారిన నుండి మనల్ని కుక్కలు రక్షిస్తాయి.

కామెంట్‌లు