అనగనగా ఒక ఊరిలో అంజయ్య అనే రైతు ఉండేవారు. అంజయ్యకు ఒక కుటుంబం ఉన్నది. భార్య లక్ష్మి పిల్లలు రవి, దివ్య వీళ్లు బడికి వెళ్తారు. లక్ష్మి, అంజయ్యకు పొలం ఉన్నది. వాళ్లు పొలం పనులు పొలం దున్ని, విత్తనాలు వేస్తారు. రోజు విత్తనాలకు నీళ్లు పెడతారు. వారం రోజులకు మొలకలు రాలేదు. అంజయ్య మంచివే విత్తనాలు తెచ్చాను కదా ఎందుకు మొలకలు రాలేదు అని విత్తనాల వ్యాపారి దగ్గరికి అంజయ్య వెళ్తాడు. విత్తనాల వ్యాపారి నేను మంచి విత్తనాలు ఇచ్చాను అని అంటాడు. విత్తనాలను పరీక్షించితే నకిలీ విత్తనాలు అని తెలిసింది. అప్పుడు అంజయ్య నకిలీ విత్తనాలు ఊరిలో అమ్ముతున్నావు అని తిట్టాడు. అంజయ్య చాలా మోసపోయాడు. పంట నష్టం వచ్చింది అని కుటుంబం బాధపడుతున్నారు. ఆ విషయం ఊరి వారికి తెలిసి పోలీసులకు విత్తనాల వ్యాపారిని పట్టించారు. విత్తనాల వ్యాపారికి అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పటి నుండి విత్తనాల వ్యాపారి మంచి విత్తనాలు అమ్ముతున్నాడు. మళ్లీ అంజయ్యకు విత్తనాల వ్యాపారి మంచి విత్తనాలు ఇచ్చాడు.
నీతి, విత్తనాల వ్యాపారి వాళ్లు నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మంచి విత్తనాలు అమ్మండి, రైతులకు నష్టం చెయ్యకండి.
నీతి, విత్తనాల వ్యాపారి వాళ్లు నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మంచి విత్తనాలు అమ్మండి, రైతులకు నష్టం చెయ్యకండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి