ధనవంతుల మోసాలుకె.ఉషశ్రీ- 10వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -నీర్మాల.
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. కవిత , ఐలయ్య వీళ్లది చాలా పేద కుటుంబం. ధనవంతులైన శ్రీను, మంజుల గారి పొలం పనులు కవిత, ఐలయ్య చేసుకుంటూ ఉంటారు. కవిత, ఐలయ్య పొద్దున్నే లేచి ఇంట్లో పనులు, వంట చేసుకొని పొలం పనులకు వెళ్తారు. రోజు అలాగే పొలం పనులు చేస్తారు. కొన్ని నెలలకు పంట చేతికి వచ్చింది. ఆ డబ్బులు కవిత, ఐలయ్య సగం డబ్బులు శ్రీను, మంజులకు ఇచ్చారు. మిగతా సగం కవిత ,ఐలయ్య తీసుకున్నారు. అప్పుడు ధనవంతుడైన శ్రీను, ఐలయ్యను తిట్టాడు. మాది 5 ఎకరాల పొలం ఇంత కొన్ని డబ్బులు ఇచ్చావు అని ధనవంతుడు అన్నాడు. వర్షాలు పడక పంట కొంచమే చేతికి వచ్చింది. అని ఐలయ్య తన ధనవంతునితో అన్నాడు. ధనవంతుడు కవిత, ఐలయ్య దగ్గర ఉన్న ఆ సగం డబ్బులు కూడా తీసుకున్నాడు ఐలయ్య అయ్యా నేను పనిచేసిన డబ్బులు ఇవ్వండి అని అన్నాడు. ఐలయ్యని తిట్టి పంపించాడు. ఐలయ్య కవిత చాలా బాధపడుతూ వెళ్లారు. వేరే పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు.

నీతి, ధనవంతులు పేదవారితో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇప్పుడు ధనవంతునికి డబ్బులు కావాలి ఎవరూ వద్దు అని మాట్లాడుతారు. పేద రైతు లేనిది పంట ఎవరు పండిస్తారు అని ధనవంతులు అనుకోవాలి. ధనవంతులు పేదవారిని చులకనగా చేసి మాట్లాడుతారు.
కామెంట్‌లు