2మారీచుడు ! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాత్ముడు మారీచుడు అంటే ఆశ్చర్యం గా ఉంటుంది కదూ? రామోవిగ్రహవాన్ ధర్మః అన్నాడు.భీతభక్తిలో అంతటా రాముని చూసి న తాపసి.రాక్షసుడైనా ధర్మం ని రావణుని కి చెప్పాడు."రావణా! నీకు ఎవరో రాముని పై అబద్ధాలు చెప్పారు.తండ్రి వెళ్లగొట్టలేదు.పితృవాక్యపరిపాలకుడు.విశ్వామిత్రుని యాగరక్షణకు మీసాలు రాని ఆపసివాడి బాణాలదెబ్బలకు 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడ్డాను.యాగకుండంలో రక్తాన్ని పారబోస్తున్న నా అహంకారం గర్వంని చిత్తు చేసిన భగవదవతారం.సరోవరంలో పాములుంటే జనం వాటిని చంపుతారు.వాటితోపాటు చేపలు కూడా చస్తాయి.నా ఇద్దరు అనుచరులు రాముని రెండు బాణాలకు ఆనవాలు లేకుండా పోయారు.అందుకే
నేను చెడ్డ పనులు మానేసి అన్ని చోట్లా కోదండరాం నే చూస్తూ ఉన్నాను.ఇప్పుడు సీతామాత భార్యగా 
ఉన్న ఆయన శక్తి సంపన్నుడు.నీకున్న వెయ్యి మంది భార్యలతో సుఖించు." నిజంగా అంత పరివర్తన తో సాధుజీవితం గడుపుతున్న మారీచుడు మహనీయుడు.చెడుమార్గం నించి భక్తి మార్గం లో పయనించిన మారీచుడు ఆదర్శనీయుడు..
 చుప్పనాతి శూర్పణఖ కి గోళ్ళలో  బుద్ధి లో విషం.రాముని పొందాలని అనుకుంది.అందుకే రాముని తో " నీ భార్య అందంగా లేదు.నన్ను పెళ్ళాడు" అని అడిగితే లక్ష్మణుని దగ్గరకు పంపితే ఆయన దాని ముక్కు చెవులు కోస్తే అది బుడిబుడి ఏడ్పులు ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ రావణుని దగ్గర కెళ్ళి ఎలా రెచ్చగొట్టేలా మాట్లాడిందో చూడండి " నీకు తగిన అందగత్తె ఆసీతని నీ భార్య గా చేసుకో అన్నయ్యా! నీ గూఢచారులు ఏమీ చెప్పలేదు కదూ?" అని అగ్ని లో ఆజ్యం పోసింది.ఒక్క దెబ్బ కు రెండు పిట్టలు ఆమె ప్లాన్.రాముడు తనకు దక్కుతాడు.సీతపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది.సీత వల్లనే తనను రాముడు నిరాకరించాడు అని ఆకుళ్లు బుద్ధి చుప్పనాతి భావం.సీతపై కోరిక పెంచింది..
కామెంట్‌లు