వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143
 ఏ పుట్టిన బిడ్డ కైనా ముందు తల్లి   ప్రధానం  తరువాత తండ్రి  ఆ తర్వాత తనకు అక్షరాలు నేర్పిన గురువు  ఎక్కడ నుంచో పొట్టకూటి కోసం వచ్చిన వ్యక్తి  సమాజంలో నీ బిడ్డను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దడానికి  నడుము కట్టి ముందుకు వచ్చినవాడు  కనుకనే  వారిని భగవత్ స్వరూపంగా గురువుగా భావించి నమస్కరిస్తారు  పిల్లలు  మనం ధ్యానం నేర్చుకోవాలి అనుకుంటే గురు ముఖతదాన్ని నేర్చుకోవాలి  ఏ అక్షరం తెలుసుకోవాలన్నా అది వారు చెప్పవలసినదే  గురువు అన్న పదంలోనే     అనల్ప అర్థం ఉంది  చీకటిని తొలగించేవాడు  అంటే నీలో ఉన్న  అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసాదించే వాడు అని అర్థం  పోల్చ తగిన వ్యక్తి లేనివాడు  గురువు కనుకనే వారిని భగవత్ స్వరూపంగా ఎంచి  వారు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కనిపించినా ముందు పాదాభివందనం చేస్తాం  అది గురువు నేర్పిన సంస్కారమే.
పూజ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అది ఎలా చేయాలి  ఏ పద్ధతిలో తన మనసును కేంద్రీకరించి  ఏ భగవత్ స్వరూపాన్ని మనం  భక్తితో పూజించాలి అనుకుంటున్నామో  దానిపైన మనసును కేంద్రీకరింప చేసేది గురూజీ  వారు చెప్పిన ప్రతి వాక్యం  ఆమోదయోగ్యం  గురువు  అన్న నమ్మకంతో వారి వద్ద విద్యాభ్యాసం ప్రారంభిస్తాము  ఆయన మనసు పెట్టి చెప్పకపోయినట్లయితే  ఈ ప్రపంచంలో గడ్డి పోచకు కూడా కొరకాకుండా పోతావు అన్న విషయం   తల్లిదండ్రులకు తెలిసి  తమ బిడ్డను అన్ని అధికారాలతో గురువుకు అప్పగించడం  మన సంప్రదాయం  గురువు యొక్క రూపంలోనే  మనకు జన్మనిచ్చిన బ్రహ్మ  జీవితంలో మనల్ని పెంచిన విష్ణు  సక్రమ మార్గంలో నడపడానికి అన్ని ఏర్పాట్లు చేసిన శివ  ఈ త్రిమూర్తులను గురువులు అనే మనం చూడడం  మన బాధ్యత.
పోల్చడానికి మరెవరు లేరు అన్న  శబ్దం గురు  గు అంటే  చీకటి  రూ అంటే రూపుమాపేవాడు  నీలో ఉన్న అజ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చిన యోగి  లగువు ప్రక్కన దీర్ఘము ఉంటే అది గురు అవుతుంది  గురువు ప్రక్కన ప్లుతం ఉంటే  అది గురు అవుతుంది దాని ప్రక్క కాకుమానం ఉంటే అది దాని ప్రక్కన ఓంకారం ఉంటే అది గురువుగా భావించబడుతుంది  ఒకరిని మించి మరొకరు ఎవరైతే ఉన్నారో వారు గురువుగా భౌతికంగా మనం చెప్తాం  చివరిగా వచ్చి ఇది ఎవరికీ పోలిక లేదు అని ఏ భగవత్ స్వరూపాన్ని మనం మనసులో కోరుకుంటామో  ఆ స్వరూపమే గురువుగా నీ కట్టెదుట నిలబడి  నీకు అకారం నుంచి క్షకారం వరకు  ప్రతి అక్షరాన్ని విడమర్చి  అర్థ తాత్పర్యాలతో సహా బోధించే  మహానుభావుడు ఆ ఉపాధ్యాయుడు అన్న విషయం  జీవితంలో ఏ ఒక్కరూ మరిచిపోరు మరిచిపోలేరు  గురు శబ్దం శాశ్వతం.


కామెంట్‌లు