ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆకాశవాణిలో మా గురువుగారు ఉషశ్రీ గారు విజయవాడ వచ్చిన తర్వాత గోపాలస్వామి గారిని ఆనేకసార్లు కలవడం ఆయన నిశిత విమర్శలను  వినడం వల్ల సన్నిహిత సంబంధం ఏర్పడింది  కాకాని వెంకటరత్నం గారు  భారత్ సేవక సమాజo ద్వారా విశాఖపట్నంలో శిబిరం ఏర్పాటు చేసినప్పుడు  నేను గన్నవరం ఎమ్మెల్యే రత్న బోస్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న డాక్టర్ భాస్కర రావు గారితో సన్నిహిత సంబంధం ఏర్పడింది అక్కడ ఉన్న 21 రోజులు విశ్వవిద్యాలయంలో ఉండడం వల్ల కె.వి గారితో మంచి చొరవ ఏర్పడింది  విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన శాక్రిఫై  శాఖ అని బెల్లంకొండ రామదాసు గారు చాలా కాలం క్రితమే అనువదించారు.దానిలో జై సింగ్ పాత్ర నాకెంతో ఇష్టమైంది నేను కాలేజీలో చదువుతున్నప్పుడే రంగస్థలం మీద ప్రదర్శించాను అప్పుడు కుమారి సూర్య ప్రభావతి పాప సుభాన్ సింగ్ రాజు గురు ఆకాశవాణిలో వార్తల ద్వారా ప్రఖ్యాతులు అయిన ఏవై మ మన్నారు గారి సోదరుడు మునులు రాజు సోదరుడు రవీంద్రనాథ్ రాజు వీడు కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి అనేక సినిమాలను నిర్మించి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా తీసుకున్నారు  అప్పట్లో శహన్షా మహల్ నేటి రాజకీయాలు అప్పటి కమిషనర్ అజిత్ సింగ్ ప్రఖ్యాత డాక్టర్ అచ్చమైoబ సమక్షంలో ప్రదర్శించి బహుమతులు కూడా పొందాము ఆ నాటకాలు కూడా ప్రసారం చేసాము  మే 62లో 18వ తేదీన ఫేట్ స్టోరీ ని కాలేజీ లెక్చరర్ హిరియన్  గారు అనువదించారు మరో లెక్చరర్ శ్రీనివాసరావు గారు నిర్వహించారు అందులో కరణంగా నేను అమ్మగా కుమారి శాంతి ఫ్రాన్సిస్  కుమారి హీరా వాసుదేవన్ నటించారు.
అదే రోజు నండూరి విటల్ గారు రచించిన పరోపకారం నాటిక లో నేను సుశీల మహంతి కూచి మంచి కుటుంబరావు నండూరి సుబ్బారావు గారు పాల్గొన్నారు  1963 లో అనేక నాటకాలలో మంచి పేరు  సంపాదించుకున్నాను ఎల్లోరా గారు రచించిన జైహింద్ నాటికను నండూరి సుబ్బారావు గారు నిర్వహించారు వాటితో పాటు నేను వింజమూరు లక్ష్మీదేవి ఎస్ కుటుంబరావు పాల్గొన్నారు  ఫిబ్రవరి 15వ తేదీన కొమ్మూరు వేణుగోపాల్ రావు గారు రచించిన  తప్పు నాటికలో ఎం శ్యామల ఎం నాగరత్నమ్మ శ్రీరామ్మోహన్ రావు నండూరి చoడూరి మధుసూదన్ రావు పాల్గొన్నారు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన అశ్వద్ధామ నాటకం ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమైంది నాతోపాటు ఎన్సీవి జగన్నాథచార్యులు వింజమూరు లక్ష్మి శ్రీరామ్మోహన్రావు సుబ్బారావు పాల్గొన్నారు.


కామెంట్‌లు