;ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

మానవతా విలువలను మాధ్యమాల ద్వారా ప్రతిబింబించడం చాట్ల కు ఎలా అలవడింది ఇంతవరకు మానసికంగా ఎలా పొందగలిగారు అని ఆలోచించి వారిని గురించి అధ్యయనం చేయడం ప్రారంభించాను నాకు నచ్చిన వ్యక్తుల్ని ఒప్పించి వారి మాటల్లో వారి జీవితాలను రికార్డు చేయటం అలవాటు చేసుకున్నాను ఆ కోవలో చాట్ల శ్రీరాములు గారిని కూడా రికార్డ్ చేశాను రెండున్నర గంటలు వారి గాత్రాన్ని నా దగ్గర భద్రపరుచుకున్నాను  ఓ ప్రేక్షకుడు శ్రీశ్రీ ని కలిసి సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీ కవిత్వం చచ్చిoది ఏమిటి అని ప్రశ్నిస్తే కడుపు నిండిన తర్వాత కవిత్వం అన్నాడట దాని తాత్పర్యం బీదరికాన్ని అనుభవిస్తే తప్ప జీవితం అర్థం కాదు మనవాళ్లు ఒకరోజు ఉపవాసం చేసిన ఇస్లాం మతస్థులు 30 రోజులు చేసిన దాని వెనుక అర్థం భౌతికంగా ఎదుటివారి  

ఆకలి బాధ తెలుసుకోవడం కోసమే.నకనకలాడే తన కడుపు ఎలాంటి విష పరిణామాలకు దారితీస్తుందో తెలియ చెప్పడమే. విజయవాడలో అచ్చయ్య దంపతులకు అతి  బీదరికం లో జన్మించినవాడు చాట్ల శ్రీరాములు గారు సొంతగా ఆస్తిపాస్తులు లేని అచ్చయ్య గారు విజయవాడ మున్సిపల్ స్థలంలో పాక వేసుకొని జీవిస్తూ చుట్టుప్రక్కల గ్రామాలనుంచి వచ్చే గడ్డి తాటాకులను అమ్మి  పెట్టి జీవనo సాగిస్తూ నిరక్షరాకష్యూడు అయిన  తాను తన ఇద్దరు కుమారులను చదివించాడు శ్రీరాములు గారి 13వ సంవత్సరంలోనే ఆదిలక్ష్మి గారితో వివాహమై అచ్చన్న గారికి ఆర్థిక భారం పెంచింది దాంతో చదువు మానేసి ఉద్యోగం చేస్తానన్న కొడుకుతో దెబ్బలాడి ఎస్ఆర్ఆర్ కళాశాలలో చేర్పించి తన మిత్రులతో మావాడు లండన్లో చదువుతాడు అయ్యా అని చెప్పుకునే వాడు చిత్రం ఏమిటంటే ఎంతో కష్టపడి లండన్ వెళ్లి నాటకాన్ని ప్రదర్శించి అనేక దేశాల వారికి మన నాటక కళల గురించి చెప్పిన కొడుకు లండన్ యాత్రను చూడకుండానే కను మూయడం తండ్రిగారి దురదృష్టం ఆయన చూసి ఉండి ఉంటే ఎంత మురిసిపోయేవారో తన స్నేహితులతో ఎంత గర్వంగా చెప్పుకునేవారో.కాలేజీలో చదువుతూ ఉండగానే ఇద్దరు పిల్లలు పుట్టడం ఆర్థిక పరిస్థితి క్షీణించడం 30 రూపాయలకు రెండు గంటల పాటు టైపిస్ట్ మరో రెండు గంటల పాటు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసి మరో నలభై రూపాయలు సంపాదిస్తూ కాలేజీ జీవితం అయింది అని అనిపించారు కాలేజీ నుంచి బయటపడగానే రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులకు ఆసరా ఏర్పడింది మాస్టర్ నాటకం వేశాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖ అంతర్ కళాశాల పోటీలో విశాఖ స్వర్ణ పతకాన్ని అందుకోవడం ద్వారా 1300 మంది ఉన్న కళాశాలకు సెలవు ప్రకటించడం అనేది ఆయన జీవితంలో మరిచిపోలేని మొదటి రోజు  నాటకాలు అంటే మోజు వీరికి అదే జీవిత బాట అని ఆ రోజే నిర్ణయించుకున్నారు.


సమన్వయం ; డాక్టర్ . నీలం స్వాతి 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం