ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 60 సంవత్సరాలకు పూర్వమే దక్షిణాది మైసూర్లో ఒక చిన్న క్లబ్బులో అతి తక్కువ వనరులతో తక్కువ సాంకేతిక సదుపాయాలతో ఆల్ ఇండియా రేడియో సివిల్ రేడియో నెట్వర్క్ అనే పేరుతో ప్రారంభించబడింది  1948 డిసెంబర్ ఒకటో తేదీన ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర రెవెన్యూ విద్యాశాఖ మంత్రి కళా వెంకట్రావు గారు విజయవాడ కేంద్రాన్ని ప్రారంభించారు  నేను 1962 నుంచి రేడియో లో పని చేస్తున్నాను అప్పటికి నేను కళాశాల విద్యార్థిని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి  ఆంగ్ల నాటకాలలో పాల్గొన్నాను 63లో విజయవాడ కేంద్రంలో నాకు ఉద్యోగం వచ్చింది రేడియో స్టేషన్ ప్రారంభించినప్పటి నుంచి అన్నీ ప్రత్యేక ప్రసారాలు ప్రభుత్వపరంగా స్టేషన్ డైరెక్టర్ ప్రోగ్రామ్ ఎక్స్క్యూటివ్ ట్రాన్స్మిషన్  అధికారులు ఉంటారు.కొంతకాలం జరిగిన తర్వాత ఒక్కొక్క విషయాలకి ఒక్కొక్క నిష్ణాతుడైన పేరు ప్రఖ్యాతులున్న వారిని ఎంపిక చేసి ప్రభుత్వ అధికారులు కన్నా ఎక్కువ జీతాలు ఇచ్చి కార్యక్రమాలను రూపొందింపచేసేవారు  అలా వచ్చిన వారే బందా కనకలింగేశ్వర రావు గారు నాటిక శాఖను  డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సంగీత శాఖ డాక్టర్ జీవీ కృష్ణ రావు గారు సాహిత్యాన్ని  ఏడిద కామేశ్వరరావు గారు చిన్న పిల్లల కార్యక్రమాల్ని కందుకూరి రామభద్రరావు గారు విద్యా కార్యక్రమాన్ని ఆమంచర్ల గోపాలరావు గారు కార్మికుల కార్యక్రమాన్ని  నిర్వహిస్తూ ఉండేవారు వారిని  ప్రొడ్యూసర్ అనే పేరుతో పిలిచేవారు  నేను కేంద్రానికి వచ్చేసరికి బాలమురళి గారు సంగీత కళాశాల ప్రిన్సిపల్ గా వెళ్లారు ఆ తర్వాత మద్రాస్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
1948లో ప్రారంభించినప్పుడు దీని స్థాయి ఒక కిలోవాట్ ఆ ప్రసార శక్తి 1957 జనవరి 21 తేదీ నాటికి 20 కిలో ఓట్లకు మారింది నేడు 100 కిలో శక్తితో ప్రసారమవుతుంది  దక్షిణాది ప్రాంత రేడియో స్టేషన్ లలో  విజయవాడ కేంద్రానికి ప్రత్యేక స్థానం  కృష్ణా పశ్చిమగోదావరి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిధిలో ప్రసారాలు జరుగుతూ ఉండేవి  ప్రతిరోజు మూడు ప్రాంతీయ మూడు జాతీయ వార్తలతో పాటు సంగీత సాహిత్య కార్యక్రమాలను కలుపుకొని  50 కార్యక్రమాల వరకు ప్రసారం అవుతూ ఉన్నాయి  1962లో ఆగస్టు 9వ తేదీన ఒక కిలో వాట్ శక్తితో వివిధ భారతి ప్రసారాలు ప్రారంభమయ్యాయి  ఇవి సామాన్యులకు సైతం అర్థం అయ్యేవిధంగా రూపకల్పన జరిగింది.కామెంట్‌లు