ఏ తల్లి పేగుబంధానివో?!- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
ఏతల్లిపేగుబంధానివో?!
ఏ సుడిగాలికెగిరొచ్చిన
ఎండుటాకువూ?!
నువ్వో పండుటాకువూ?!


మూగనోము నీసొంతము
నీవారెవరో ?!
నీఊరేదో ?!
మరిచిపోయిన
బేలవూ!

ఏడపుడితివో?!
ఏడచస్తవో?!
అయినోడెవడో?!
కానోడెవడో?!
చెప్పలేవునీవమ్మా
తీరిపోయోనీకాలము
వాలిపోయెనీ ఆశలపొద్దు

ఆ దేవుడిపిలుపుకై
నీ ఎదిరిచూపులు

ఈ లోకంమరిచెను
నీ చిరునామా

కామెంట్‌లు