వాకిలి-డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871
శుభ్రం చేసిన చీపురు చేతనత్వం వాకిలి
చల్లిన అలుగుల అలుకు  
వక్రీభవనం చెందిన అద్దంలో ముఖబింబం 
మన ఊరూ వాడా వాకిలి 

వాకిలి మీకు చిన్నదిగా అనిపించొచ్చు కానీ
మనసంత విశాల మైదానం అది
చలం మైదానంలా లోతైనది కూడా

అమ్మకూ ఆ వాకిలికీ నడుమ
ఎన్నో ఊసులూ ఆశలూ మెరిసాయి
అదో మహోజ్వల మానస వీణ

నాలాగే ఇంకా
అరడజను చినుకులకు ఊపిరైంది
చలన సంచలన అక్షరసేద్య మడి 
నిశ్శబ్దగొంతుల పెకిలించిన శబ్దస్ఫూర్తి
ముషాయిరాల గాన కవనాల చైతన్యక్షేత్రం

ఊరంతా వెలుగుల వాకిలి బతుకు
బోధనలు పారాడిన మెతుకు దీపం
జీవి పెనవేసుకున్న సుఖదుఃఖాల గీతమే వాకిలి

అమ్మైనా కొమ్మైనా ఆకుపచ్చ 
వాకిలి మనసులోంచే వస్తేనే
ఊరు తలుపులూ ఇంటి తలపులు తెరుచుకొనేది మనిషి గుండెల
ప్రయాణం ఎవరిదైనా గమ్యానికి 
తొవ్వ చూపు మానవత్వపు వాకిలి


కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Full of imagery. Symbolical expressions of cleaning both the place and mind of an individual. Congrats to the poet