పక్షిబాల స్తుతిమాల- -గద్వాల సోమన్న,9966414580
ప్రొద్దున్నే లేచిందొక
ముద్దులొలుకు పక్షి బాల
గొంతెత్తి పాడిందొక
భగవంతుని స్తుతిమాల

ఈ పూటకు తన నోటికి
కాసింత ఆహారము
కావాలని వేడింది
భక్తితో ప్రణమిల్లింది

ఎచ్చోటికి తిరిగినా
తన గూటికి చేర్చమంది
ఉపద్రవం ఎదురైనా
తప్పించి బ్రోవమంది

స్వేచ్ఛను ఇచ్చినందుకు
శతకోటి స్తుతులంది
కడుపును నింపినందుకు
తలవొంచి వందనమంది


కామెంట్‌లు