ఆదర్శ గమనం.;- త్రిపురారి పద్మ.(ఆర్). జనగామ


  వీరంతా నేను గతంలో పనిచేసిన వెల్దండ ఉన్నత పాఠశాల (2004-2005) కు సంబంధించిన పదవతరగతి విద్యార్థులు.

    ఈరోజు మావారికి మరియు మా గురువులందరికీ ఎంతో సంస్కార యుతంగా గౌరవ సత్కారం చేసారు.

    వీరిలో చాలా మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, మేనేజర్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు.మరికొందరు విద్యార్థుల్లో ఒక ప్రత్యేకత ఉన్నది.అదేంటంటే  బాగా చదువగలిగే పిల్లలయినా ఆనాటి కుటుంబ కారణాల రీత్యా ఉన్నత విద్యనభ్యసించ లేకపోయినా తాము బడిలో నేర్చుకున్న సంస్కారంతో, నేర్చుకున్న విద్యను తమ తమ ఆసక్తులతో మరింత పెంచుకొని, ఎవరికి వారుగా గ్రామ స్థాయిలోనే స్వంత వ్యాపారాలను పెట్టుకొని,ఆ వ్యాపారాన్ని అభివృద్ధి దిశగా పెంపొందించుకున్నారు.

     ఎనిమిది, తొమ్మిది తరగతుల్లోనే అనేక కష్టాలనుభవించి,కూరగాయలమ్మి,ఆటో నడిపి, వాటితో పొదుపు చేసిన డబ్బులతో టెంట్ హౌజ్ నిర్వహిస్తూ, గ్రామం లోని యువత కోసం ఒక సహకార యువజన సంఘాన్ని నడిపిస్తూ,ఆ సంఘం ద్వారా ఎంతో మంది పేదలకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ, యువతకు పొదుపు మంత్రాన్ని నేర్పిస్తున్న వెంకటేష్ అభినందనీయుడు.ఈ యువకుడు ఇప్పటికీ ఎన్నో పుస్తకాలను చదువుతూ, మధ్య మధ్యలో వచ్చే సందేహాలను మా ఉపాధ్యాయులకు ఫోన్ చేసి తెలుసుకుంటూ ప్రతి నెలా తమవారందరికీ చక్కటి సందేశాత్మక ఉపన్యాసాన్ని అందిస్తాడు.తాను,తన మిత్రులు కలిసి పొదుపు చేసిన డబ్బులతో ఒక స్థలాన్ని కూడా కొన్నారు.అందరికీ లాభం చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నామని చెప్పారు.తాను బ్రతుకుతూ,పదిమందినీ బతికించే వైపు పయనించే ఈ ఉద్యోగానికి మించినవి ఇతర ఉద్యోగాలని నేను భావించడం లేదు.

     ఎవరో ఏదో ఉద్యోగం కల్పిస్తారని ఆశ పడకుండా తమ స్వయంకృషితో తామే ఎదిగారు వీరందరూ., గ్రామంలోనే బట్టలదుకాణం నిర్వహిస్తున్న నరేష్,అలంకరణ పని(డెకరేషన్) నిర్వహిస్తున్న పరమేశ్,గ్రామావసరాలకు అనుగుణమైన ఇతర వ్యాపారాలతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్న భాను చందర్, భాస్కర్, శ్రీకాంత్ మరియు ఇతర విద్యార్థులు అభినందనీయులు.

     లక్షల వేతనాలతో కూడిన ఉద్యోగాలే ఘనమైనవని అనుకోకుండా తాము కడుపు నిండా తింటూ,మరో పదిమంది కడుపు నింపేలా చేస్తున్న వీరి గ్రామస్థాయి ఉద్యోగాలు కూడా గొప్పవే అని నా భావన.

    అంతే కాదు వీరంతా వారి వారి కుటుంబాలతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారు.

    దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలం టారు.నిజంగా ప్రతి గ్రామంలో ఇలాంటి యువకులంతా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని, అభివృద్ధి దిశగా సాగితే, ఉరుకుల పరుగుల రణరంగం లాంటి పట్టణ జీవితాల్లో కాలుష్యం తగ్గడంతో పాటు, కుటుంబ వ్యవస్థ పటిష్టమవుతుంది కదా అనిపించింది.

     ఉన్నతమైన ఆలోచనలు కలిగిన ఈ మా విద్యార్థులు ఈనాడు జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించడానికి మా ఇంటికి వచ్చిన సందర్భంలో దిగిన చిత్రమిది.

    ఫోన్ చేసి చెబితే సరిపోతుంది అన్నా కూడా, లేదు, లేదు మేము స్వయంగా వచ్చి ఆహ్వానించడమే సరైన పద్ధతని చెప్పి,ఆహ్వానించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం