జల సంరక్షణ మనందరి బాధ్యత;-సి.హెచ్.ప్రతాప్
 నీరు సకల జనులు, సకల జీవరాశులకు ప్రాణా ధారం వర్షం. సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, కాల్వల ద్వారా మనకు నీరు దొరు కుతుంది. అపరమయిన వనరుగా ఉన్న నీరు ఇపు డు దొరకడం లేదు.
 భారత్‌లో భూగర్భ జలాల్లో 80శాతం వ్యవసాయానికి, 12శాతం పరిశ్రమలకు, 8శాతం తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. భూగర్భ జలవనరుల అంచనా నివేదిక-2020 ప్రకారం దేశీయంగా పంజాబ్‌, హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌లో భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు మరింత క్షీణించే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్‌ గతంలోనే హెచ్చరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు పూర్తిగా మట్టి నిండిపోయినవి దీంతో అడపాదడపాగా వచ్చిన వర్షాల వల్ల నీరు నిల్వ ఉండలేకపోతుంది.  దీంతో తరచుగా నీటి కొరత ఏర్పడటం తో తాగునీరు దొరకడం కష్టతరంగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడంతో చెరువులు కుంటలు అన్యాక్రాం తనికి గురవుతున్నాయి.చెరువులు కుంటల్లో పూడికలు చేరి నీటి శాతం దిన దినంగా అడుగంటిపోతున్నాయి. వీటికి నీరందించే కాల్వలు నాలాల్లోను పూడికలు ఏర్పడి నీరు అందడం లేదు.. అలాగే గ్రామాల్లో భూగర్భజలాలు క్రమేపీ తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు తోడు అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురవుతున్నాయి. ఫలితంగా కొద్దిపాటి వర్షాలకే నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయిప్రకృతి కాపాడుటకు వాతావరణ సమతుల్యతకు, పచ్చదనానికి, పరిశుభ్రతకు, చల్లదనానికి ఊతమిచ్చే జలాశయాలు చెరువలు కుంటలు సమాజానికి ఎంఒతో మేలు చేస్తాయన్న విషయాన్ని పాలకులు గుర్తించకపోవడమే ప్రధాన కారణం .చెరువులు కుంటలు పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి మన చెరువుల, కుంటలు మనమే పరిరక్షించుకోవాలి. చెరువులు, కుంటలు కనుమరుగైపోతే మానవ జీవితమే సమాప్తం.  వర్షాలు కురిసిన ప్రతిసారి ఉత్పన్నం అయినట్లే ఈ సారి కూడా వాన నీటి సంరక్షణ ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఓ వైపు ప్రజలు నీటి కోసం అల్లాడుతూ ఉంటే మరో వైపు వాన నీరు వృథాగా పోతోంది. చెరువులు, కాలువలు, కుంటలు, భూగర్భంలోకి చేరాల్సిన వాన నీరు మురికి కాలువల్లోకి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో వాన నీటి సంరక్షణకు అంతా ఇప్పుడే కదలాలి అన్న బాధ్యతను ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి. చుక్క చుక్కను ఒడిసి పట్టాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి.

కామెంట్‌లు