నా ఆలోచన;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 స్త్రీ పురుష సంగమం వల్ల బిడ్డ తల్లి గర్భంలో ప్రారంభమవుతుంది  ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మార్పు వస్తుంది ఆ బిడ్డకు  దానిని దశావతారములు అంటారు  దశ అంటే మార్పు  స్థితి అనే అర్థం  మొదటి నెలలో ఆ పిండం చేప ఆకారం ఉంటుంది రెండో నెలలో తాబేలు ఆకారంగా మారుతుంది మూడో నెలలో పంది అకారంగా మారుతుంది  అక్కడ నుంచి మానవ ఆకృతి రావడానికి మొదటగా పొట్టి వాడు  ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తి వారి తరువాత  పరశురాముడు చివరకు బలరాముడు  అందర రాములు అయిన తర్వాత తొమ్మిదవ నెలలో బుద్ధి  శరీరంలో ప్రవేశిస్తుంది కనుక దానిని బుద్ధ అవతారంగా చెప్పారు  దశావతారములు అంటే మన వారు చెప్పేది 10 అవతారాలు అని  ఆ పది ఎక్కడ ఉన్నాయి అని అంటే రాబోయే కల్కి అవతారము అని సమాధానం చెబుతారు  అది ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియని పదార్థం.అంటే పరోక్షంగా వారు చెప్పింది ప్రతి మనిషిలోను పశుతత్వం  దైవ తత్వం రెండు కలిసి ఉంటాయి అని  అంటే దైవమే అని వారే ఒప్పుకుంటున్నారు ఈ ప్రపంచంలోకి వచ్చాక బిడ్డను చూసి  దేవుడు అన్న శబ్దానికి అర్థం దివ్ అంటే జ్ఞానం, ఆ జ్ఞానం కలిగిన వారు దేవుడు  ప్రపంచంలో మనం చూస్తున్నాం ఏ పశుపక్షులకు  జంతువులకు లేని ప్రత్యేక లక్షణం మానవునికి ఉన్నది అది మాట్లాడడం  ఎదుటివారు మాట్లాడినది అర్థం చేసుకోవడం దానికి సమాధానం చెప్పగలగడం  దానినే బుద్ధి అంటున్నాo ప్రతి బిడ్డ జ్ఞానంతోనే పుడుతుంది అని శాస్త్రం చెప్తోంది  జీవితంలో తనకు కలిగిన సంఘటనలను  ఎలా అనుభవిస్తున్నాడు  కష్టభరితమైన వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నాడు అన్న వాడు జ్ఞానమే విజ్ఞానం  ఆ విజ్ఞానం కలగడం వలన ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకోవడానికి  ప్రయత్నంచేస్తాడు మనిషి  ఆ ప్రయత్నం వల్లనే అంతరిక్ష ప్రయాణానికి కూడా దోహదపడింది.భగవంతుడు ఎవరు అనేదానికి సమాసము ఎవరైనా చెప్తున్నారా  అంత పరిజ్ఞానం ఎవరికైనా ఉన్నదా  నిజంగా భగవంతుడు ఉండి ఉంటే ఆ భగవత్ స్వరూపాన్ని ఎదురుగా పెట్టి పూజిస్తూ వశిష్ట మహర్షి దగ్గర నుంచి విశ్వామిత్ర మహర్షి వరకు ప్రతి ఒక్కరూ తపస్సులో ఉండేవారు కదా  ఆకారం లేని ఏకాంత ప్రదేశంలో కూర్చుని తన మనసునే నమ్ముకుని  పంచేంద్రియాలు తన స్వాధీనం చేయడానికి ఎందుకు ప్రయత్నించారు  నిజంగా భగవంతుడు ఉంటే ఏదో ఒక అవతారంలో ఉండాలి ఒక పేరుతో ఉండాలి  భారతీయులకు కనిపించిన ప్రతిదీ దైవమే  చెట్లను పూజిస్తాము పాములను పూజిస్తాం  రైతులు ఎడ్ల ను పూజిస్తారు  నాగలినే పూజిస్తారు చేనును పూజిస్తారు ఇవన్నీ దైవ స్వరూపాలు కావా అనేది ప్రశ్న  ప్రతి గ్రామ దేవతను  మనం ప్రతి గ్రామంలోనూ చూస్తూ ఉంటాo  ఆమె మహత్తులు అన్ని ఇన్ని కాదు అని డప్పాలు చెప్పుకుంటాం.


సమన్వయం ; డాక్టర్ . నీలం స్వాతి
కామెంట్‌లు