దిద్దుకో!;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నీకు నువ్వే చెక్కుకో నీకు నువ్వే మార్చుకో
నీకు నువ్వే తీర్చుకో నీకు నువ్వే దిద్దుకో
నీకు నువ్వే చెప్పుకో నీకు నువ్వే  మారిపో
ఎవరో వస్తారని ఏదో చేస్తారనిఎదురు చూడకు 
ఎదురు వెళ్ళకు తడబడకు మడమతిప్పకు
ఇతరులకోసం నిన్ను నీవు మార్చుకోకు
ఇతరులకోసం నిన్ను నీవు బాధించుకోకు
మంచిఎప్పుడూ మంచే చెడుపుఎప్పుడూ చెడుపే
ఎదుటివాడెప్పుడూ నిన్నుచూసి ఏడుస్తూనే ఉంటాడు
తనకు లేదని ఏడుపు, లేదా
ఏదుటివాడికి ఉన్నదని ఏడుపు
నిన్ను ఏది బాధిస్తుందో అది అందరినీ బాధిస్తుంది
నిన్ను ఏది ఆనందింపజేస్తుందో
అది అందరినీ ఆనందింపజేస్తుంది
కనుక,... నీవు నీతోబాటు అందరూ సంతోషపడేట్లు 
నీ నడవడికను తీర్చిదిద్దుకో!
**************************************

కామెంట్‌లు