ఎలుగెత్తిచాటు దము...! ;- కోరాడ
అమ్మ ఆవు ఇల్లు ఈగ
 మా బడి చదువులు ఆనాడు
 A ఫర్ ఏపిల్ B ఫర్ బాల్
 కాన్వెంట్ చదువులు ఈనాడు

అమ్మ, అత్త, నాన్న , మామ
పిలుపులో ప్రేమ ఆనాడు
మమ్మీ,డాడి,అంకుల్, ఆంటీ
కృతకపు పిలుపులు ఈనాడు

చిడత - బిళ్ల ... ఏడు పిక్కలు
పదుగురితో ఆటలు ఆనాడు
సెల్ ఫోన్ లో ఒంటరిగా... 
 ఆడే ఆటలు ఈనాడు...! 

అరిసెలు, బూరెలు , జంతికలు
ఇంటి వంటలు ఆనాడు
 పిజ్జా , బర్గర్ , నూడిల్సు
 హోటళ్ల తిల్లు ఈనాడు...! 

చదువుకుతగ్గ సంస్కారముతో
 వినయ, విధేయత లానాడు 
 గొప్ప చదువులు చదివిన గానీ
  నిర్లక్ష్యపు ధోరను లీనాడు...!! 

ఈనవీనవిద్యా విధానము కన్న 
 మనసనాతన పద్దతులేమిన్న
  ఆ విద్య వలననే వినయము
 గౌరవ మర్యాదలు పెరుగును

మన మాతృభాషను, మన
చదువులను గౌరవించుదాము
ప్రపంచంలో మనగొప్పతనాన్ని
 ఎలుగెత్తి మనం చాటుదము !! 
    *******

కామెంట్‌లు