సుప్రభాత కవిత -బృంద
తెల్లని వెన్నెల సోనలంటి
తెల్లవారి వెలుగుల్లో
తెలిమంచుపొరల మధ్య
ఇంద్రచాపం ఇలకు దిగుతుంటే...

మయూరమైన మనసు 
నర్తిస్తూ స్వాగతించు వేళ
సాకారమైన స్వప్నాలు
ఓంకారాలు పలుకుతుంటే!...

నింగినుండీ రంగుల పల్లకి
తెచ్చే సందడైన సంబరాలకు
అవని పైన వేడుకలు
రంగరంగ వైభోగంగా జరుగుతుంటే...

అరాచకానికి అంతం పలికి
అభివృధ్ధికి పట్టం కడుతూ
అందరొకటై పండుగలాగా
ఆనంద గీతాలు పలుకుతుంటే...

తలవంచని  తరువుల్లాగా
నిలువెత్తుగ పొంగిన భావం
వెలుగులేవో ఒక్కసారిగా
నిలిచి తోడుగ దారి చూపుతుంటే...

అక్షరాలకు అందని భావం
అంతరంగాన మెదులుతుంటే
అంతర్యామికి కృతజ్ఞతగా
ఆనందంగా కంట నీరు చిమ్ముతుంటే...

కొత్తగ తోచే ఉదయాన్ని స్వాగతిస్తూ

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు