బడిగంటలు మ్రోగే వేళ ;- గుండాల నరేంద్ర బాబు,
పల్లవి:                       
బడి గంటలు మ్రోగే వేళ
మది అంబరమయ్యింది/
గది తలుపులు తెరిచే వేళ 
తెగ సంబర  పడుతోంది/             
  బడి గంటలు మ్రోగే వేళ మది అంబరమయ్యింది/     
గది తలుపులు తెరిచే వేళ తెగ సంబర పడుతోంది/
గురుదేవుని చూడగ మీరొస్తే/బడి
 మాదని మురియగ మేమొస్తే/ అది చదువుకు శ్రీకారం/                      
బడి గంటలు మ్రోగే వేళ 
మది అంబరమయ్యింది/      
గది తలుపులు తెరిచే వేళ 
తెగ సంబర పడుతోంది 

చరణం:1                
అమ్మ పైట కొంగు వెంట పిల్లలంతా తరలి వచ్చిరంటా../ఆ పిల్లలతో బడి అంతా నిత్యం కళ కళలాడె నంట/
మా నమ్మకం మీరే నిలపాలీ నిలపాలి.../
మా బిడ్డల భవిత మీరే కావాలి కావాలి/
పిల్లల మదిలో  నిలిచి పోవాలి పోవాలీ/
గురుశిష్యుల అనుబంధం పెరగాలి పెరగాలి/
శిష్యుల ఘనతకు మూలం గురువై/
గురు ప్రతిభా కిరణాలు శిష్యులై../
గురువులను మరువకుండా ఎల్లప్పుడూ ఉండాలి/గురువుకు తగ్గా శిష్యులు అని నిరూపించాలి/                    బడి గంటలు మ్రోగే వేళ మది అంబరమయ్యింది/      
గది తలుపులు తెరిచే వేళ 
తెగ సంబర పడుతోంది  

చరణం:2                       శాస్త్రీయతకు పట్టం కట్టాలీ కట్టాలి/
శిష్యుల ప్రతిభకు పదును పెట్టాలి పెట్టాలి పెట్టాలి../బంగరు భవితకు బాటలు వేయాలి వేయాలి/
మా చిరునామా మీరే కావాలి కావాలి కావాలి/
నీతికి నిలువుటద్దాలు మీరై /అమ్మానాన్నల ఆశలు మీరై /కన్నవాళ్ళ కన్నీళ్లే తుడిచి  ఆదరించాలి/
చెరగని మీ అడుగులలో  మేము పయనించాలి

 (చిత్రం:,నిన్నే ప్రేమిస్తా,సంగీతం:ఎస్.ఏ.రాజ్ కుమార్, సాహిత్యం:గంటాడి కృష్ణ, గానం :రాజేష్,చిత్ర, 

పేరడీ రచన :
గుండాల నరేంద్ర బాబు, 

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత "

తెలుగు ఉపాధ్యాయులు 
కే ఎన్ ఆర్. నగర పాలక ఉన్నత పాఠశాల, బి. వి.నగర్, నెల్లూరు, సెల్ :9493235992

తేది:13-06-2024న ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు పునఃప్రారంభిస్తున్న  నేపథ్యంలో రాసిన పేరడీ పాట 

( గుడి గంటలు మ్రోగిన వేళ "శైలిలో...)


కామెంట్‌లు