(కందములు )
==========
76.
ఇభచర్మాంబరధర!హర!
యభయంకర!నిన్ను దలచి యానందముగన్
విభవముగా పూజ సలిపి
శుభమిడు దేవర వనియెద జూడుమ శంభో!//
77.
కన్నుల మాయలు గప్పగ
బున్నెపు దారిని జనరట మూఢపు జనులున్
జెన్నుగ మనమున దలచెద
నిన్నెడ బాయని మతినిడు నెఱవుగ శంభో!//
78.
ఉనికియు మనికియు నీవని
కనిపెట్టితి నో హర!నను కానగ రావా!
యనిశము నిన్నే దలచెద
మన లేనురనిన్ను వదిలి మరువకు శంభో!//
79.
జీవము నీవని నమ్మితి
పావన మొందగ నిను తని వారగ గొల్తున్
నావగ దీర్పుము శంకర!
భావన జేసెద నిరతము భవహర!శంభో!//
80.
భోగములే వలదంటిని
యోగీశ్వరనీదు సేవ లుత్సాహముగన్
రాగముతో జేయుదునే
త్యాగపు గుణముల నిడు శివ!దయగొని శంభో!//
==========
76.
ఇభచర్మాంబరధర!హర!
యభయంకర!నిన్ను దలచి యానందముగన్
విభవముగా పూజ సలిపి
శుభమిడు దేవర వనియెద జూడుమ శంభో!//
77.
కన్నుల మాయలు గప్పగ
బున్నెపు దారిని జనరట మూఢపు జనులున్
జెన్నుగ మనమున దలచెద
నిన్నెడ బాయని మతినిడు నెఱవుగ శంభో!//
78.
ఉనికియు మనికియు నీవని
కనిపెట్టితి నో హర!నను కానగ రావా!
యనిశము నిన్నే దలచెద
మన లేనురనిన్ను వదిలి మరువకు శంభో!//
79.
జీవము నీవని నమ్మితి
పావన మొందగ నిను తని వారగ గొల్తున్
నావగ దీర్పుము శంకర!
భావన జేసెద నిరతము భవహర!శంభో!//
80.
భోగములే వలదంటిని
యోగీశ్వరనీదు సేవ లుత్సాహముగన్
రాగముతో జేయుదునే
త్యాగపు గుణముల నిడు శివ!దయగొని శంభో!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి