మహోన్నత వ్యక్తిత్వం! అచ్యుతుని రాజ్యశ్రీ
 దేశభక్తుడు రచయిత వివిధ సంస్థలు నెలకొల్పిన నిర్వహించిన కార్యదక్షత దీక్ష తో వెలుగొందిన తెలుగు తేజం 80 వ ఏట అమరులైనారు.అహ్మద్ నగర్ కోటలో బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి ఉంచారు.ఆయన సరదాగా రకరకాల పక్షుల ఈకల్ని సేకరించి తలదిండుగా తయారు చేశారు.పైగా దానిపై ఓతమాషా ఆంగ్ల రచన చేశారు.ఆయన తెలుగు ఉర్దూ హిందీ ఆంగ్లం లో మంచి వక్త.చెణుకులు చెమక్కులతో సభను అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర రాష్ట్రాల వారిని ఆకట్టుకునే వారు.
త్వరగా విమర్శించకుండా అంతా విని " ఇక్కడ మీరు తప్పు గా భావిస్తున్నారు" అని చెప్పేవారు.2 ఒకసారి ఎవరో" సుభాష్ చంద్రబోస్ ని కాంగ్రెస్ నుండి ఎందుకు బహిష్కరించారు?" అని ప్రశ్నిస్తే "కాంగ్రెస్ నియమాలను ఉల్లంఘించిన వారిని బహిష్కరిస్తారు.మీలాంటి అనామకుల్ని పట్టించుకోరు" అని ఠపీమని జవాబిచ్చారు.మైసూర్ 
లో కన్నంబాడి ఆనకట్టను చూడాలని  పంచెకట్టు లో 
వెళ్లిన ఈపెద్దమనిషిని ఎవరూ పట్టించుకోలేదు.ఇంజనీర్ల ను కొన్ని ప్రశ్నలు అడిగేటప్పటికి వారు బిత్తర పోయి నీళ్ళు నమిలారుట!"మీ ఫోటో కావాలండీ" అని ఈయన వల్ల ఉపకారం పొందిన వ్యక్తి అడిగితే " నేనేం పెద్ద సేవ ఉపకారం చేయలేదు.ఐనా నా ఫోటో ఇవ్వడం నాకు ఇష్టం లేదు" కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రిక స్టేట్స్ పీపుల్ అనే ఆంగ్ల పక్షపత్రిక సంపాదకుడిగా పనిచేశారు.1928 లోనే ఆలిండియా స్పిన్నర్స్ అసోసియేషన్ ప్రారంభించారు.కరాచీలో అఖిలభారత ప్రజా మండలి సభాధ్యక్షుడు గా ఉంటూ ఎన్నో సంస్థానాలు దర్శించారు.ఆంగ్లప్రభుత్వ పాలనలో పోలీసు అధికారులు దురుసుగా ఉంటే ఈయన వారి ని ఇలా నిలదీశారు " మీరు దెబ్బలు కొట్టే ముందు ఆవ్యక్తి మీబంధువు సోదరుడు అని ఎందుకు భావించారు?" అంతే జవాబు చెప్పలేక తలవాల్చారు
సిగ్గుతో . తన 5 వ ఏట నే తండ్రిని పోగొట్టుకున్న ఆయన బాల్యం కష్టాల కడలిలో గడిచింది.మద్రాసు
 క్రిష్టియన్ కాలేజీ లో చదువుతున్న ఆయువకునికి
బాగా డబ్బు పేరున్న లాయర్ తన కూతురు నిచ్చి పెళ్లి చేసి డాక్టర్ గా ఆయనకి వెలుగు బాట పరిచాడు.ఆ అల్లుడు స్వాతంత్ర్య సంగ్రామంలో దూకి తెలుగు వారి సత్తా చాటాడు.ఆయన డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు.ఫెదర్స్ అండ్ స్టోన్స్  1600పేజీల కాంగ్రెస్ చరిత్రను రాసిన మేధావి.50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేయబడింది . ఆంధ్ర బ్యాంకు కృష్ణాకో ఆపరేటివ్ బ్యాంక్ భారత లక్ష్మి బ్యాంకు .. ఆయన నెలకొల్పారు.1952 లో గవర్నర్ గా పనిచేశారు.🌷

కామెంట్‌లు