రామోజీరావు మృతికి సంతాపం
 అర్ధ శతాబ్దం పాటు పత్రికా రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేసిన  సి హెచ్ రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతున్నామని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం జాతీయ అధ్యక్షులు చౌధరి రాధాకృష్ణ అన్నారు. రామోజీరావు మరణవార్త విని వారి సామాజిక సాహిత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ప్రస్తావించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం జాతీయ అధ్యక్షులు చౌధరి రాధాకృష్ణ తో పాటు, ఉపాధ్యక్షులు డి.ఏ.స్టాలిన్, ప్రధాన కార్యదర్శి కొమ్మన పురుషోత్తం, కార్యదర్శి పారశెల్లి రామరాజు, కోశాధికారి కొప్పల సూర్యనారాయణ , కార్యవర్గ సభ్యులు కుదమ తిరుమలరావులు శనివారం నాడొక ప్రకటనలో తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కామెంట్‌లు