ఆరోగ్యవంత సమాజం .. ఆనందకర బాల్యం కోసం.. ;-నాశబోయిన నరసింహ (నాన)

 ఆరోగ్యవంత సమాజం .. ఆనందకర బాల్యం కోసం.
ఒక్క మాత్రతో పొట్టలోని వందలాది నట్టలని నులిపేద్దాం   ...
(20 జూన్  2024, జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం)..
జాతి భవితవ్యం తరగతి గదుల్లో నిర్మాణమై ఉన్నదని మన పెద్దలు చెప్పినట్లు అటువంటి క్లాస్ రూమ్ లో ఉండే పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, నాణ్యమైన విద్యను పొందాలి. కానీ పిల్లలు సక్రమంగా హాజరు కాకపోవడానికి కడుపులో క్రిములతో(పొట్టలో నట్టలు) కలిగే అనారోగ్యం కూడా ఒక కారణమని తెలుసుకుని ప్రభుత్వం 2009 సం.నుండి జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ(ఎన్.డి.డి.) కార్యక్రమాన్ని  ప్రారంభించింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా రెండు సార్లు ఆరు నెలలకోసారి ఎన్.డి.డి.రోజున డి వార్మింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తూ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు నమిలి మింగించడం జరుగుతుంది. బడిలోపలి పిల్లలతో ప్రారంభించిన ఈ ఎన్.డి.డి. కార్యక్రమం ఆ తర్వాత బడిబయట పిల్లలకు మరియు ఒక సం.చిన్నారుల నుండి 19 సం.ల వయసు పిల్లలందరికీ డీవార్మింగ్ మాత్రలు మింగించడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్) శాఖల సమన్వయం,సహకారం, సౌజన్యంతో... సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
బంగారు బాల్యాన్ని నులిపేస్తున్న నట్టలను నలిపేసే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో మనమంతా భాగస్వాముల మవుదాం. ఒట్టేసి చెబుదాం.. ఒక్క మాత్రతో పొట్టలోని వందలాది పురుగుల పీక నొక్కేద్దాం...
ఎన్.డి.డి.రోజు, 20జూన్ 2024 న ఒకటి నుంచి ఐదు సం.ల లోపు పిల్లలకు మరియు 6 నుంచి 19 సం.ల బడి బయట పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో ఆల్బెండ జోల్ మాత్రలు మింగిస్తారు. బడికి వెళ్లే ఆరు నుంచి 19 సం.ల పిల్లలకు పాఠశాలల్లో, కాలేజీల్లో ఆల్బెండజోల్ 400 ఎం.జి. మాత్రలను నమిలి మింగించడం జరుగుతుంది.
నులిపురుగులు అంటే ఏమిటి? 
నులి పురుగులనేవి మానవుని ప్రేగులోంచి పోషకాలను,రక్తాన్ని గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు (parasites).మనిషి అతిదేహి.ఆతిథ్యం ఇచ్చేవాడు (Host).నులి పురుగు అతిథి (guest). నులిపురుగులు మూడు రకాలు. 1).ఏలిక పాములు (Round Worms): వీటి శాస్త్రీయ నామం: Ascaris lumbricoides. ఇవి 10నుంచి 20సెం.మీ. పొడవుంటాయి. రోజుకు రెండు లక్షలకు పైగా గుడ్లు పెడతాయి. ఎక్కువ సంఖ్యలో ఏలిక పాములు ఉండటం వల్ల ప్రేవులలో అడ్డు గోడలుగా నిలుస్తాయి.
రోగ లక్షణాలు: అజీర్తి,కడుపు నొప్పి, నీరసం,పోషకాహార లోపం.
2).నులి పురుగులు ( pinworms/Thread Worms): ఈ పురుగులు తెల్లని రంగులో సన్నగా దారం పోగులాగా అర అంగుళం పొడవుంటాయి. వీటి శాస్త్రీయ నామం: entirobias varmicularis.ఈ వ్యాధి సంక్రమించిన వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేయడం వల్ల మట్టి కలుషితమై ఆ గుడ్లు చేతుల ద్వారా నీరు,ఆహారం ద్వారా ఇతరులకు వ్యాపించును. 
రోగ లక్షణాలు: మలద్వారం చుట్టూ దురద,రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన జరుగుతుంది. 
3).కొంకి పురుగులు(Hook worms): వీటి శాస్త్రీయ నామం: (Ankailostoma duodenale) 
ఇవి నోటి ద్వారా కాకుండా పాదచర్మం ద్వారా సంక్రమిస్తాయి. కొంకి పురుగులు తమ నోటి దంతాల ద్వారా పేగులకు రంధ్రాలు చేసి రక్తాన్ని పీలుస్తాయి. వీటి గుడ్లు మట్టిలో చేరి ఎనిమిది రోజుల్లో లార్వాగా సన్నని దారం వలె రూపొందుతాయి.ఈ దశలో చర్మం ద్వారా శరీరంలోకి వెళ్తాయి.
రోగ లక్షణాలు: రక్తహీనత, నీరసం, ఇస్నోఫీలియా ఎక్కువగుట, పిల్లలలో శారీరక, మానసిక పెరుగుదల లోపం, కాళ్లవాపులు, ముఖం ఉబ్బడం.
పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ వేటి ద్వారా వ్యాపిస్తుంది? 
ఆరుబయట పిల్లలు చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో మట్టిలో ఆడుకొనుట.అపరిశుభ్రమైన సురక్షితం కాని నీరు,ఆహారం తీసుకొనుట.భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బు నీటితో కడుక్కోపోవుట. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయుట.పెరిగిన గోళ్లను కత్తిరించక పోవడం.పరిసరాల పారిశుధ్యం లోపించడం.అపరిశుభ్రమైన ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా నులి పురుగులు సంక్రమిస్తాయి.
ఎవరెవరికి ఎక్కడ మాత్రలు వేస్తారు:
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం అనగా 20 జూన్  2024  రోజున అంగన్వాడీ కేంద్రాలలో: ఒకటి నుంచి ఐదు సం.ల వయస్సు గల చిన్నారులకు మరియు 6 నుంచి 19 సం.ల వయస్సు గల నమోదు చేయని బడి బయట పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో ఆషా కార్యకర్తలు ఈ మాత్రలు వేస్తారు.
ప్రాధమిక,ఉన్నత పాఠశాలల్లో: ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు,కాలేజీలలో నమోదు చేయబడిన పిల్లలందరికీ ఎన్.డి.డి. రోజు ఏ.ఎన్ ఎం.లు, ఉపాధ్యాయులు మాత్రలు వేస్తారు. ఆ రోజు పాఠశాలకు వెళ్లని మిస్ అయిన పిల్లలకు 27 జూన్  2024 (మాప్ అప్ డే) రోజున తిరిగి ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారు.
ఆల్బెండజోల్ మాత్రల మోతాదు:
ఒకటి నుంచి రెండు సం.ల చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర (200 mg) పొడిచేసి, నీటితో కలిపి మింగిస్తారు. 2 నుండి 19 సం.ల వయసు పిల్లలకు ఆల్బెండజోల్ పూర్తి మాత్ర (400ఎం.జీ.) భోజనం చేసిన తర్వాత చప్పరించాలి లేదా నమిలి మింగాలి. ఆ రోజు అంగన్ వాడీ కేంద్రాలలో, పాఠశాలల్లో భోజనం చేసిన తర్వాత శుభ్రమైన త్రాగు నీరు,గ్లాసులు ఏర్పాటు చేసుకొని కార్యక్రమం విజయవంతం చేయాలి.ఆ రోజు ప్రార్థన సమయంలో విద్యార్థులకు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మరియు చేతులను సబ్బు నీటితో కడుక్కుని పద్దతులను నేర్పించాలి.
ఆల్బెండజోల్ మాత్రలు ఎవరు వేసుకోరాదు: జబ్బులున్న వారు, ఇతర మందులు వాడుతున్న పిల్లలు ఈ మాత్రలు వేసుకోరాదు.
నులి పురుగులు రాకుండా నివారణ చర్యలు:
బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ధరించాలి.సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి.భోజనం,ఇతర ఆహార పదార్థాలు తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బు నీటితో కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా, మరుగు దొడ్లని వాడాలి.పెరిగిన గోళ్లను కత్తిరించి, శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. పరిసరాల పారిశుధ్యం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా నులి పురుగులు రాకుండా నివారించవచ్చు. (20 జూన్ 2024 జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా)
           _ నాశబోయిన నరసింహ (నాన), కవి,రచయిత, ఆరోగ్య విస్తరణ అధికారి,సంగారెడ్డి జిల్లా, 8555010108.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం