.అండరమూ పుడతాము-.. కోరాడ నరసింహా రావు!
అండరమూ పుడతాము
  కొందరే... అతికొద్ది మందే
 మెరుస్తూ చరిత్రలో నిలుస్తారు

అది వారి అదృష్ఠ మంటారుకొందరు...! 
  కాదు, అది వారి కృషి, పట్టుదలే అంటారింకొందరు.!!!
    
ఎందరు ఎంతకష్టపడటంలేదు? 
 అందరూ ఇలా గెలిచి నిలవ గలుగు తున్నారా..!? 
 కల కాలం మెరవ గలుగుతు న్నారా...?! 

 ఎందరో సమర్ధులు కూడా... 
  అదృష్టమునకైఎదురుచూన్తూ
  ఎదుగు - బొదుగు లేకుండా
 ఎక్కడ వేసిన గొంగలి అక్కడె
  అన్నట్టుండి ...పోతున్నారు.!! 

జీవిత మనే రధం... 
 అత్యద్భుతంగా పరుగులుతీసి
  చరిత్రసృష్ఠించి మెరవాలంటే..
   కృషి- పట్టుదలలు ధృడమైన
 పట్టాలు కావాలి...!! 
   అదృష్టం అవరోధాలను తొలగిస్తుండ గల గాలి...!!! 

అప్పుడే....ఎవరైనా జీవితంలో
 గెలిచి, నిలిచి,మెరవగలరు...! 
 అటువంటి అద్భుత వ్యక్తి.... 
 రామోజీరావు గారి ఆత్మకు
  సత్ గతులు కలిగి.... 
 మరింత మహోన్నతునిగా
  పునః జన్మించాలని... 
మనః పూర్వకముగా.. 
 ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ... 
.
    *******

కామెంట్‌లు