మీపాట - మీనోట; - కోరాడ
మీపాట - మీనోట 
    పర్యావరణ గేయాలు...! 
పర్యావరణ పరి రక్షణకై...! 
గీత రచన స్వరకల్పన, గానం... 
      కోరాడ నరసింహా రావు 
           *****
పల్లవి :-
    పర్యావరణ పరిరక్షణకైకదలి రమ్ము సోదరా...! 
  చేయి చేయి కలపగా రమ్ము నీ వు సోదరి...!! 
   కదలి రమ్ము నీవు సోదరి...! 
          " పర్యావరణ....... "
చరణం :-
ఆరు రుతువులూ క్రమము తప్పక వచ్చు చుండెడివి
ఆనాడు... 
  కాలుష్యపుకోరలలో చిక్కి... 
    గతులు తప్పెను ఈనాడు..!
 ఏటికి ఏడు ఎండలుపెరిగి... 
మల - మల మాడు చుండెనుభూగోళ0...! 
 ఆకాల వర్షపు అతివృష్ఠి , 
 అనావృష్ఠిలతో  విల విల లాడు ప్రజానీకం....!! 
    " పర్యా వరణ..... "
చరణం :-
మితి మీరిన మనిషి సుఖాానికి
  కొండ లెన్నో తరిగి పోయెను
 ఆడవు లెన్నెన్నో అంతరించెను
  కార్ఖానాలు , వాహనాలు.... 
 ప్లాస్టిక్కు పరికరాలు.... 
 ఏసి లు... ఫ్రిజ్ లవి ఎన్నో...
   విషాలనే క్రక్కుచుండెను.... 
 నేల, నీరు, గాలి మొత్తం
 కలుషితమై పోయె నహో...!! 
   రోగాలనె మన వారసులకు
మన మిచ్చే ఆస్తులా...! 
      " పర్యావరణ..... "
కాలుష్యాలను నివారించగా 
ప్రతిన బూని కదలి రండు .... 
 ఆరోగ్యమైన సమా జాన్ని
 నిర్మించుదాము సిద్దము కండు.!!
        *******

కామెంట్‌లు