నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ
ది ష్రౌడ్ ఆఫ్ టురిన్ అని పిలువబడే వస్త్రం లో జీసస్ క్రైస్ట్ పార్ధివదేహం చుట్టబడి సమాధి చేయబడింది. ష్రౌడ్ అంటే శవంపై కప్పేబట్ట అని అర్ధం. 4.34 మీటర్లపొడవున్న ఆవస్త్రంపై  జీసస్ మొహం గాయాల్తో కనపడుతుంది. 1357లో లిరే అనే చిన్న పల్లె లో ఫ్రాన్స్ లో ఉండేది. దాన్ని ఇప్పుడు  వెండిపేటికలో ఇటలీలోనిటురిన్ అనే ప్రాంతంలో సెయింట్ జాన్ బాప్టిస్ట్ కెథెడ్రెల్ లో ఉంది 1578నుంచి. మధ్యయుగంనుంచి అది క్రీస్తు ది అని జనం భావిస్తున్నారు. 
 అలాగే సహారా ఎడారి ఒకానొకప్పుడు అందమైన పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది. క్రీ.పూ.10వేలులో  అలా ఉన్న ఆప్రాంతం నేడు ఎడారి. మరి భవిష్యత్తులో ఈభూగోళం పూర్తి గా ఎడారి గా మారుతుంది అని అంతా గగ్గోలు పెడుతున్నారు. మరి మనం ఏంచేయాలో చెప్పినా చెవిటివాడిముందు శంఖం ఊదిన చందంగా మారాం మనం🌹

కామెంట్‌లు