సి నా రే.. సింగిరెడ్డి నారాయణరెడ్డి
కవితా కుసుమాలు తెలుగు పదాల దర్పానికి సోయగాలు..
ఆయన కలం నుండి జాలువారిన పదాల జల్లు పాటల హొయలు
హృదయాంతరాల మీటే హరివిల్లు..
ఆయన బెణుకులు, చెణుకులు
జావళీలు, హిందీ గజల్స్
సమాజానికి దర్పణాలు..
ఆయన ఠీవి
తెలుగు ప్రతిభకు దివిటీ..
ఆయన వర్చస్సు గాంభీర్యం
ఆయన వాచస్సు
ముగ్ధ మనోహర సమ్మోహనం..
నన్ను దోచుకుందువటే పాటతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం
వేలాది ప్రేక్షకులకు శ్రోతలకు
ఆయన పాటలు
పండిత పామరులకు
కమనీయ వంటకం.
ఆయన కృతులు
నవ్వని పువ్వు
దివ్వెల మువ్వలు
ఋతు చక్రం
మంటలూ మానవుడు..
ఇతిహాస కావ్యం విశ్వంభర
ఆయన సాహితీ సౌరభాలు
అందుకున్న పురస్కారాలు ఎన్నో..
ఆయన వాగ్భూషణం
నిత్య కళ్యాణం పచ్చ తోరణం.
ఆయన లేని లోటు
తెలుగు జాతికి వారెవ్వరూ పూడ్చలేని లోటు..
సి నా రే తెలుగు జాతి మరువలేని
మహోన్నత శిఖరం
తెలుగు పద్య గీతిక కు
ఎవరెస్ట్ శిఖరం.
తెలుగు వెలుగులు
జగద్విదితం చేసిన
పుంభావ సరస్వతి..
జ్ఞానపీఠ్ ఆయనకు కాదు
తెలుగు సొగసులకు
లభించిన మహోన్నత పురస్కారం
తెలుగు జాతికి పట్టాభిషేకం.
కర్పూర వసంత రాయలైతే నేమి
ఏక వీర, విశ్వంభర,
కావ్యమైనా, గేయమైనా
కలమే హలంగా అలవోకగా దున్ని
మనసుతో బీజాక్షరాలు నాటి
మైమరిపించే బాసలు పేర్చి
హృద్యమైన కవిత్వాన్ని పండించిన కృషీవలుడు..సాహితీ వల్లభుడు
సి నా రే కృతులు
విజ్ఞానపు జ్యోతులు
చైతన్య ప్రభోదాలు
సి నా రే కీర్తి
ఆ చంద్ర తారార్కం
ఆయన స్మృతులు
అజరామరం..
ఆయనను వరించిన
అవార్డులు రివార్డులు
ఆయనను వరించిన
పదవులు బిరుదులకు
ఆయనే ఆభరణం..
వాటికే వన్నెలు దిద్దిన
మహానుభావులు.
బిరుదులకు లొంగిపోని
గేయ భగీరథుడు..
ఆయన సంతానం
గంగా యమున సరస్వతి కృష్ణవేణి
నదీమ తల్లుల పేర్లు
ఆయనకి సంస్కృతీ సంప్రదాయలకు ఇచ్చిన విలువకు తార్కాణాలు..
తెలుగు పాట బతికి ఉన్నంత వరకు
తెలుగు జాతి నీ యాది మరవలేదు
సాహితీ జగత్ నీ జాడ వీడ లేదు
సినీ వినీలాకాశంలో తారవై వెలుగొందుతూనే ఉంటావు..
సాహితీ జగత్తులో
మీరొక సాహితీ స్రష్ఠ
నీ ముద్రలు భావి తరాలకు
చెరగని తీపి ఉండ్రాళ్లు.
పాట ఉన్నంత వరకు
సినారే కృతులు నాట్యమాడుతూనే ఉంటాయి..
ఆయన రచనలు
మానవాళికి ప్రబోధ గీతాలు
ఆయన గేయాలు
అందరినీ ఓల లాడించే రస రమ్య గీతాలు..
ఆయన ఒక
నిత్య చైతన్య మూర్తి
చిద్విలాస పద్మభూషణుడు
ఆచార్య సింగి రెడ్డి నారాయణుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి