ఆకాశవాణి విజయవాడ కేంద్రం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
అందుకే బoదా గారు నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూనే ఉంటారు బ్రతక దలుచుకుంటే కుక్క కాపలా ఎంత కృతజ్ఞతతో ఇంటి సొంత మనిషిలా బాధ్యతలు స్వీకరిస్తున్న మాదిరిగా కాపలా కాయాలి భగవంతుడు ఎలా మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాడు అలాగే అంత పవిత్రంగా అంత పసిపిల్లగా అంత నిష్కల్మషంగా కాపలా కాసి అలాగే ఆయన దగ్గరికి వెళ్లాలి అప్పుడు విశ్వాసం పెరుగుతుంది ఎప్పుడు జిప్సీ లాంటి కుక్కలా విశ్వాసంతో బ్రతికినప్పుడు బ్రతుకు పరి పుష్కి అని అనిపిస్తుంది నాకు  మా జిప్సీ మరణానంతరం  బందా గారి దగ్గరనుంచి చింతా సూర్యనారాయణ మూర్తి గారి వరకు రేడియో నాటకాల కాలాన్ని ఒక శకం గా పరిగణిస్తే దాదాపు మధ్యలో శ్రీ గోపాల్ గారి వరకు గోల్డెన్ పిరియడ్ అని చెప్పవచ్చు.అప్పటివరకు పౌరాణిక జానపద కాల్పలిక నాటకాలకు పరిమితమైన రంగాన్ని బళ్ళారి రాఘవాచారి గారు రంగస్థలాన్ని సాంఘిక నాటకాల వైపు మరలించి కొన్ని నాటకాలు ప్రదర్శించారు కూడా ప్రత్యేకంగా రాజమన్నారు నాటకాన్ని రక్తి కట్టించి ఒప్పించడం సాహసోపేతమైన ప్రక్రియ ఒక రకంగా ఇది అసిధారా వ్రతం లాంటిది  రెండే పాత్రలతో సాగిన ఆ నాటకంలో ఆయనకు తగిన జోడిగా అప్పట్లో అందరి మెప్పును పొందిన పద్మావతి గారి గాత్రధారణ అందరిని అలరించింది ప్రత్యేకించి రచయిత జడ్జి గారు రచయిత మాత్రమే కాదు మంచి సాహితీ విమర్శకులు కూడా.పద్య గద్య రచనలను గురించి ఆయన మాట్లాడితే న్యాయాధిపతిగా తీర్పునిచ్చినట్టే అవుతుంది  బళ్లారి వారికి కొత్తేమీ కాదు  ఆ తర్వాత కెవిఎస్ కుటుంబరావు గారు సీతారత్నమ్మ గారి అరగంట నాటిక నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపు ఊపింది  అని చెప్పాలి  దీనిలో కూడా రెండే రెండు పాత్రలు  అరగంట నాటకాన్ని  శ్రోతలకు విసుగు లేకుండా  కొన్ని వందలసార్లు విజయవాడ కేంద్రం ప్రసారం చేయటమే కాకుండా హైదరాబాద్ మద్రాస్ బెంగళూరు మైసూరు విశాఖపట్నం కడప ఢిల్లీ కేంద్రాల నుంచి కూడా ప్రసారం చేయడం  గమనార్హం  మా రేడియో కుటుంబానికి పెద్ద కెవిఎస్ కుటుంబరావు గారి లాంటి నటుడు ఆంధ్రప్రదేశ్లో రేడియోలో లేడు అని చెప్పవచ్చు  ఆయన శిష్యరికంలో అనేక విషయాలు నేర్చుకొని పనిచేయడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను

============================================
సమన్వయం . డా. నీలం స్వాతి 
 
కామెంట్‌లు