ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ మనస్సు కూడా అలాంటిదే  ఎన్నో ఆలోచనలతో ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా  అది కావాలి ఇది కావాలి ఇది చేస్తే బాగుంటుంది అది ఇలా చేయకూడదా అంటూ ఆలోచిస్తూ ఉంటే  మనసు నిండా ఆలోచనలే తప్ప  పరిష్కారాలు దొరకవు  ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ  దానికి పరిష్కారం తెలియకపోతే పెద్దల సలహాలను తీసుకుని ఏం చేస్తే బాగుంటుందో అది చేయాలి తప్ప  ఇలా చేస్తే ఆ పని కాకపోతే మరి ఎలా చేయాలి అని తనలో తానే ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటే మనసు మొత్తం చికాకు పడుతుంది  చివరకు శరీరం ఎందుకు పనికిరాకుండా  నీ ఆచరణలో లేకుండా  ఆసుపత్రి పాలు కావలసి వస్తుంది  కనుక మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకున్నట్లయితే జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నది నిజం.నిన్న నేడు రేపు అన్నది  ఒక చక్రం లాంటిది  ఒక వాహనానికి చక్రం ఎలా పైనుంచి కిందకు కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుందో  మానవ జీవితంలో కూడా ఇవాల్టది రేపటికి నిన్న అయిపోతుంది  ఇవాల్టిది రేపు  రేపటికి నిన్న అలా పైకి కిందకి మారిపోతూ ఉంటాయి మాటలు మాత్రం అవే  నిన్న ఏదో తప్పు చేసి ఉండవచ్చు దానిని ఈరోజు ఆలోచించడం వల్ల ఆ తప్పును సరిదిద్దుకోగలడా కనుక అలాంటి ఆలోచనలతో బుర్ర వేడెక్కే లా చేసుకోవచ్చు రేపు ఎలా చేయాలని అనుకుని అలా జరగకపోతే మన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలోనే ఉంటే  అతని పరిస్థితి ఎలా ఉంటుంది కనుక నేటిని నిజంగా చేయటానికి కష్టమైనా  నిష్ఠురమైనా ధైర్యంగా ఎదుర్కో మానవ ప్రయత్నానికి విజయం తప్ప అపజయం ఎప్పుడూ ఉండదు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకో.మన నానుడులలో జాతీయాల్లో  అసలు శబ్దాలు వేరు మనం పలికే పద్ధతి వేరు తెలిసి తెలియక కొన్ని వాడుతూ ఉంటాం  వాటిలో పండగ పూట కూడా పాత మొగుడేనా  అనేది చాలామంది వాడుతూ ఉంటారు  మన సంస్కృతికి సంప్రదాయానికి విరుద్ధమైన ఘోరమైన మాట కదా పండుగ అంటే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద చిన్న అంతా కలిసి హాయిగా కొత్త బట్టలు ధరించి  మంచి ఫలహారాలు చేసుకుని ఆ రోజంతా ఆనందంగా గడిపే రోజు ఆ ఆనందానికి ఒక్కడు కాక మరొక పురుషుడు కావాలా ఆచరణలో మాట్లాడుతున్నారా  అసలైన సామెత ఏమిటంటే పండగ పూట పాత మడుగేనా మడుగు అంటే వస్త్రం  ఇవాళ పండగ కదా ఈరోజు కూడా పాత బట్టలేనా కొత్తవి కొనుక్కుని ధరించలేరా అనడానికి  ఆ అపశబ్దాన్ని వాడుతూ   ఉండడం ఎంత ఘోరమైన  అవమానమో తెలియడం లేదు.
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 



కామెంట్‌లు