హితోక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
మనశ్శాంతి దూరమగును
చింతిస్తే మేలు కాదు
శ్రమ లేక ఫలితం లేదు
అభివృద్ధి కానరాదు

పొడవరాదు వెన్నుపోటు
నమ్మకానికదేపోటు
మిత్ర ద్రోహం బహు చేటు
తెచ్చిపెట్టు గుండెపోటు

కల్పితాలు నీచగుణం
గౌరవించరోయి జనం
మంచితనం మూలధనం
జీవితాన ఘనం! ఘనం!

కలతలతో క్రుంగిపోకు
నెమ్మదికి దూరం కాకు
అహంకార మనసుతో
పాల వోలె పొంగిపోకు


కామెంట్‌లు