ఎంతో గొప్ప కవి పండితుడు ఐనా నిరాలాజీ ది బోళా పసిమనసు.కడుపులో మాట దాచుకోకుండా ఠక్కున అడిగేసే మనస్తత్వం." నాకు సందేహం వస్తే అడగకూడదా!?" అని ప్రశ్నిస్తే ఎవరూ ఆయన్ని అపార్ధం చేసుకునేవారు కాదు.ఓసారి తన కవితలు విన్పించి" ఎలా ఉంది?" అని అడిగారు.ఓపిల్లకవికి ఆయన కవిత అంత బాగా అర్థం కాలేదు.కానీ ఆయన మొహాన్ని చూస్తూ " అబ్బ! ఎంత పెద్ద కళ్ళు మీవి!?" అని ప్రశంసించాడు.వెంటనే నిరాలా" అవునోయ్! ఎద్దు కళ్ళలాగా ఉన్నాయికదూ నాకళ్లు?" అనేప్పటికి పాపం ఆపిల్లకవి ఉక్కిరిబిక్కిరి అయితే మిగతా వారంతా ఫక్కున నవ్వారు.
ఆయన లో ఓప్రత్యేకత ఏమంటే తన కవితల్ని యాక్షన్ చేస్తూ చదవడం.ఓరోజు హోటల్ గదిలో తన కవితాపఠనం చేస్తూ కుస్తీ ని వర్ణిస్తూ అక్కడున్న ఓశ్రోతతో నిజంగా కుస్తీ పట్టేప్పటికి పాపం ఆమానవుడు తలుపుగట్టిగా పట్టుకోటం మిగతావారు అడ్డుకోవడం తో ఆవ్యక్తి కింద పడ్డాడు కానీ రోడ్డు మీదకు దొర్లి పోలేదు" అని ఆయన స్నేహితులు చెప్పుకుని నవ్వుకునే వారు.ఒకసారి ఇద్దరు సాహిత్యకారులు ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకునే టైం లో నిరాలాజీ పెద్ద గా " ఏంటా కాకిగోల?" అని గద్దించేప్పటికి గప్ చిప్! నోరెత్తలేదెవ్వరూ! గల్లీలో పిల్లలతో కబడ్డీ ఆడేవారు.ఒకసారి కాలేజీ పిల్లల తో ఫుట్బాల్ ఆడారు.తన దగ్గరకు వచ్చిన బంతిని" చూడండి నా కిక్" అని కాలితో ఎగరేయటం ఆయన పాత చెప్పు తెగటం జరిగింది.కానీ సరదాగా నవ్వేశారు చెప్పు లేకుండా ఎలా నడవాలి అని ఆలోచించని వ్యక్తి.ఆయన హాకీ ఫుట్బాల్ కుస్తీ లో దిట్ట! ఒకేఒక్క బలహీనత పొగాకు చుట్ట తాగటం!ఆయన వంటలో నలభీములను మించిన వారు.ఒకసారి కవిబృందానికి కమ్మగా వండి వార్చారు." ఎలా ఉంది నావంట?" పదేపదే అడుగు తుంటే ఒక్కరూ నోరెత్తలేదు.మరీ మరీ అడగడంతో ఒక మంచి మిత్రుడు " ఆ.. కాస్త మాడినట్లుంది" అనగానే " అవును సహజ పరిమళాలు వెదజల్లుతూ ఉంది నా వంటకం" అని అనేప్పటికి పాపం కిక్కురుమనకుండా కుక్షినింపుకుని త్వరగా ఇంటికి పరుగుపుచ్చుకున్నారు వారంతా.తన దుస్తులపై శ్రద్ధ లేదు.మురికి ధోవతి ఉత్తరీయం తో తిరిగేవారు.కానీ కవిసమ్మేళనాలకి మాత్రం ఇస్త్రీ దుస్తులలో జుట్టు పై సెంట్ చల్లుకుని వెళ్లేవారు.తన బీదరికం బలహీనతలు దాచుకోవడం తెలీని బోళాశంకరుడు అని సన్నిహితులు జాలిపడేవారు." ఏమండీ! జందెం తీసేశారు? సంధ్యావందనం చేయరా?" అని ఎవరో అడిగితే " శ్వేత జాతి పాలనలో మడి ఆచారం భ్రష్ఠు పట్టినాయి కదా? స్వాతంత్ర్యం వచ్చాక చూస్తా" అని జవాబు ఇచ్చారు.కులంమతం బీద గొప్ప చూడక అందరితో కలిసిపోయిన కవి.ఆయన కుమార్తె సరోజ్ చనిపోటంతో ఆయన తట్టుకోలేక రాత్రి పగలు అలా పచార్లు చేసేవారు.ఆహృదయవేదన" సరోజ్ స్మృతి" అనే కావ్యం గా రూపుదిద్దుకుంది.గంగాతీరంలో భార్యకి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతంలో ఎన్నో రాత్రులు ఒంటరిగా అలా తిరిగేవారు.మొదటిప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో వందల శవాలు రోగంతో గంగాతీరంలో ఎలా దిక్కు దివాణం లేకుండా పడున్నాయో తన కవిత్వంలో విషాదం నింపి రాసిన పొత్తాలు హిందీ సాహిత్యంలో అజరామరం.
( దాదాపు 100పేజీలపైగా ఉన్న శిధిలమైన హిందీ పుస్తకం లోంచి సేకరించిన సమాచారం ఇది)🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి