గురు బ్రహ్మ గురు విష్ణుగురు దేవో మహశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవే నమః..గురువు.. సాక్షాత్..పరబ్రహ్మ అని వేదాలు చెబుతున్నాయి..మాతృ దేవో భవపితృ దేవో భవఆచార్య దేవో భవ అనితల్లి, తండ్రుల తరువాత గురువే దైవంతో సమానం అని పురాణాలు చెబుతున్నాయి..గురువు కి మన సమాజం ఎంత ఉత్కృష్ట మైన స్థానాన్ని కల్పించిందో పై రెండు శ్లోకాలు చెబుతున్నాయి...అమ్మ మనకు జన్మ నిస్తేనాన్న మనకు నడక నేర్పితేనడత నేర్పేది గురువు..విద్యా బుద్దులు చెప్పి మాంసం ముద్దను మనీషి గా తీర్చి దిద్దునదిగురువు.అక్షరాలు దిద్దిచ్చిఅక్షరాస్యుడిని చేసేది గురువు..అంధకారం తొలగించేది గురువు..అమ్మ భాషకు అందాలు చెక్కిబంధాల, అనుబంధాలసంస్కృతి ని నేర్పేది గురువు..శాస్త్ర విజ్ఞానం పంచివిజ్ఞాన వంతుడిని చేసేదిగురువు..చరిత్ర బోధించిభవిష్యత్తు కి పునాదులు వేసేది గురువు..సంస్కృతి పాఠాలు చెప్పిసంఘ జీవిని చేసేది గురువు..మంచి చెడుల విచక్షణాజ్ఞానాన్ని పంచివివేకవంతుడిని చేసేది గురువు..సామ దాన బేద దండోపాయాలతోచదువు చెప్పిసంస్కారం నేర్పేది గురువు..పర భాషలు నేర్పిప్రపంచాన్ని పరిచయం చేసేది గురువు..మనలోని ప్రతిభను వెలికి తీసిపదును పెట్టి ప్రతిభావంతుడిని చేసేది గురువు..బతుకు బడి ఎక్కాలు లెక్కలు చెప్పి బతుకు తెరువుకిబాటలు పరచేది గురువు..గురువు గొప్పతనంఏకలవ్యుడి వృత్తాంతం చెబుతుంది మనకు...గురు దక్షణగాఏకలవ్యుడిలా ..మనం మనబొటన వ్రేలినిఇవ్వక్కర లేదు..మన సర్వస్వం దారపోయ్యక్కరలేదుకేవలం ప్రణమిల్లిఆ గురువులకుశిరస్సు వంచి నమస్కరిస్తేఅదే పదివేలు..అదే మన సంస్కారం..ఢిల్లీ కి రాజైనాతల్లికి కొడుకే అన్నట్లుమరి గురువుకి శిష్యుడే కదా..ఎందరో మహానుభావులగన్న ఈ నేలఎందరో మహానుభావుల ఆలవాలమే ఈ దేశం నా దేశంఈ గురు పూర్ణిమ శుభవేళనా జీవన ప్రయాణం కిఅర్థం, పరమార్థం కల్పించిన గురుతుల్యులందరికీ..వేన వేల వందనాలునాకు మార్గ దర్శనం చేసినమహానుభావులకుమనః పూర్వకకృతజ్ఞతలు.. .🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
ఓమ్ గురుభ్యో నమః;- శిరందాస్ శ్రీనివాస్-ప్రిన్సిపాల్,-వైద్య ఆరోగ్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల -నిజాం వైద్య విజ్ఞాన సంస్థ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి