అంత వరకూ ప్రపంచానికికాంతిని ప్రసా దించిన ఆ వెలుగు వీరుని
మెల్ల మెల్ల గా... ఆ చీకటిఅన కొండ, పూర్తిగా మింగేసింది...!
తన ఆకలి కుహరంలో అతడు పూర్తిగా కరిగి జీర్ణమైపోయాడ నే , అనుకుంది...!
విచిత్రం...!
ఆ వెలుగు వీరుడు ఆ
అనకొండ చీకటి పొట్టను చీల్చు కుని మరీ ... ఎర్రని రక్త వర్ణముతో.... రోజూ లానే ప్రత్యక్ష మయాడు...!!
ఈ చీకటి - వెలుగుల సమరం
ఆనాటిదా , ఈ నాటిదా...!?
ఒకరాత్రిదా... ఒక పగలుదా?!
రోజులు - వారాలు... నెలలు -
సంవత్సరాలు...,
యుగాలే గతించి పోతున్నా...
ఇది గెలుపు - ఓటమిలు తేలని పోరులా...మిగిలి పోయింది !!
ఇది ద్వంద్వములతో సమన్వయింప బడిన ప్రపంచం
ఇక్కడ అన్నీ పరస్పర పూరకాలే...!
ఎప్పుడూ....దేనికి యేదీ విభేదించదు..!!
ఈ సత్య సూక్ష్మాన్ని తెలుసుకో లేకనే మనిషి ...ప్రక్రుతి ధర్మాన్ని
మార్చేయాలని అపోహపడటం
ఓ మనిషి...!
నీవు కష్టపడి దేనినీ మార్చవ లసిన పని లేదు...!
ఈ సృష్టి లో... నీకు లభించిన దాన్ని లభించి నట్టుగా అనుభ వించి, సుఖించి ఆనందించుచా లు..!!
చా లు....! ఓ మనిషీ... చా లు
ఇంక నీ ప్రయోగాలు , ప్రయాస లూ చా లు...!!చాలు...చా లు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి