చిట్టి పొట్టి చిలకమ్మా
చిన్న చిన్న పలుకులతో
చిన్నగా మెల్లగా వస్తావా
పొట్టి పాపను చూస్తావా
నిన్ను చూసి పాపాయి
బోసి నవ్వులు నవ్వుతూ
బోర్ల పడుకొని పాకుతూ
నీ చెంతకు చేర వస్తుంది
ఎర్రని ముక్కుతో చిలకమ్మా
ఎగురుకుంటూ రావమ్మా
చెర్రి పండ్లును తేవమ్మా
పాప చేతికి ఇయ్యమ్మా
పండ్లు తిని పాపాయి
కళ్ళు మూసుకుంటుంది
ఊయల నీవు ఊపమ్మా
హాయిగా నిద్రపోతుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి