చిటికెన కు చేనేత సంఘ సన్మానం

 చేనేత వస్త్ర వ్యాపార సంఘ ఘన సన్మానాన్ని అందుకున్న డా.చిటికెన కిరణ్ కుమార్. 
      వస్త్రోత్పత్తి నందు రాష్ట్రంలోనే  దశాబ్దాల చరిత్ర కలిగిన సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం బుధవారం రోజున నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు  తాటిపాముల దామోదర్ శాలువా, జ్ఞాపిక తో ఘనంగా సన్మానించారు. సంఘ బాధ్యులు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయంగా రచనల ద్వారా సిరిసిల్ల పేరు ప్రఖ్యాతులను, కీర్తి ప్రతిష్టలను చిటికెన కిరణ్ కుమార్ ఉన్నత స్థానంలో నిలుపుతున్నాడని అందరూ గర్వించదగ్గ విషయం అని శుభాకాంక్షలు తెలియజేశారు.
          కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌడ రాజు,  ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీగాద విష్ణు, సాప భగవాన్ మరియు పారిశ్రామికవేత్తలు చిలుక సత్యం , చిటికెన వెంకటేశం, ఏనుగుల లక్ష్మణ్, గౌడ కిరణ్, ఎల్దండి శ్రీనివాస్  పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు