వైవిధ్యంసాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.

 త్రిమూర్తులలో చివరివాడైన శివునికి  గాలి నీరు అగ్ని భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు  వీటి గుణాలన్నీ ఉన్నాయి అని చెప్తారు  ప్రతి గ్రామంలోనూ రాముని విగ్రహంతో కూడిన  గుడి తప్పక ఉంటుంది దాని తర్వాత అధిక ప్రాధాన్యతనoదినది శివాలయం  ఇవి ఎక్కడ ఏ పేరుతో ఉన్నవి  తెలియని వారి కోసం  ఈ ప్రయత్నం  శ్రీకాళహస్తిలో వాయుపేరుతో జంబుకేశ్వరంలో జల లింగం పేరుతో అరుణాచలంలో అగ్ని లింగం అన్న పేరుతో కాంచీపురంలో బోలింగం చిదంబరంలో ఆకాశ లింగం కోణార్క్లో సూర్య లింగం శ్రీకాకుళం లో చంద్ర లింగం ఖాట్మండులో యజమాన లింగం  ఉన్నాయి అన్న విషయం తెలిస్తే అనేకమంది భక్తులు అక్కడికి వెళ్లి వారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు  పొందవచ్చును.

మనం తీసుకుంటున్న ఆహారంలో ఏ కూరగాయలలో ఏ  శక్తి దాగి ఉన్నదో  తెలుసుకొని దానిని వాడడం ముఖ్యం  ప్రత్యేకించి బీన్స్ను కూరగా చేసి తింటే  ఎముకలు దృఢంగా తయారవుతాయి  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి  ఆ శక్తిని పెంచే గుణం దీనికి ఉంది  ఈనాడు మధుమేహ తీవ్రత చిన్నపిల్లలకు కూడా వస్తోంది  దానిని తగ్గించడానికి బీన్స్  ఉపయోగపడుతుంది జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది  క్యాన్సర్ రాకుండా నిరోధించేందుకు ఇది మంచి ప్రయత్నం  వీటన్నిటి కన్నా ముఖ్యమైనది రక్త ప్రసరణ సక్రమంగా ఉన్నప్పుడు మిగిలిన జబ్బులన్నీ  దూరంగా వెళ్లిపోతాయి  దానికి బీన్స్ బాగా ఉపయోగపడుతుంది  శరీరంలో మంచి కొవ్వు చెడు కొవ్వు రెండు రకాలు ఉంటాయి  ఇది తినడంవల్ల ఆ కొలెస్ట్రాల్లో ఉన్న చెడు కొవ్వు ని తగ్గిస్తుంది  ఏ మానవునికైనా నయనం కన్ను ప్రధానం ఆ కంటి చూపును మెరుగుపరిచేది ఈ బీన్స్ మాత్రమే.ఇంటి ముందు కాకి వచ్చి అరిస్తే  ఎవరో చుట్టాలు వచ్చారు అన్న వార్త మోసుకొచ్చింది అన్న అభిప్రాయం  మన అందరిలో ఉంది  కావు కావు మంటూ వచ్చే కాకి అరుపులో అర్థం  రక్షించండి రక్షించండి అని  మన ఇంటిలో పదార్థాలు కానీ  ఎంగిలి కానీ తినడానికి వస్తాయి అని మనం     అనుకుంటాo  దానిని చూసి నేర్చుకోవలసినవి ఎన్ని ఉన్నాయి  బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసే ఏకైక పక్షి కాకి  ఆనాడు సీతమ్మ వారిని అపహరించడానికి  రామునికి కోపం తెప్పించిన  పక్షి కాకి  సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పరిస్థితుల లోనూ ఆహారం తీసుకోని  విహంగం  సూర్యగ్రహణానికి ముందు సూర్యగ్రహణం వదిలిన తరువాత కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది అం


దుకనే కాకిని కాలజ్ఞానం తనకు తినే పదార్థాలు ఏమైనా కనిపించే  సరికి తన జాతి పక్షులను పిలిచి వాటితో పాటు  ఆహారాన్ని పంచుకుంటా వుండే కాకి ని ప్రకృతి  మనకు సృష్టించి ఇచ్చింది.

===================================

సమన్వయం ; డా. నీలం  స్వాతి 



కామెంట్‌లు