బుద్ధుని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి, నెల్లూరు

 అందువలన మనసు ధర్మ బోధకు ఇష్టపడడం లేదు అని చెప్పారు మళ్ళీ మళ్ళీ  వేడుకున్న తర్వాత బుద్ధుడు తన బోధను గ్రహించగలిగినవారు కొంతమంది అయినా ఉంటారు వారికే ఇలా బోధించాలి అన్న నిర్ణయానికి వస్తాడు అప్పుడు బుద్ధునికి కొలనులో లీల లోహిత శ్వేత వర్ణ కమలాలు ఉంటాయి వాటిలో కొన్ని నీటి అడుగున పుట్టి అక్కడే ఉండిపోతాయి కొన్ని నీటిపై దాకా వస్తాయి మరికొన్ని నీటి కంటే పైకి ఎదిగి నీటి స్పర్శకు అతీతంగా ఉంటాయి అలానే లోకంలో జీవిత స్థాయి భేదాలున్న జ్ఞానంతో గల జనం కూడా ఉన్నారు. వీరిలో కొందరు ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్లు అలాగే ఆచరిస్తారు అని అనిపించింది  ధర్మాన్ని బోధించడానికి బుద్ధుడు సిద్ధపడిన  బ్రహ్మ నహoపతి సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ముందుగా ఈ ధర్మాన్ని ఎవరికీ చెప్పాలి అన్న ఆలోచన కలిగింది బుద్ధునికి వెంటనే  ఆలారకాలాముడు ఆయన మదిలో మెదిలాడు  ఆయన ఒక జ్ఞాని ఉన్నది ఉన్నట్లుగా చూడగలరు నేను ముందుగా అతనికి ధర్మాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు కానీ అలారకాలాముడు ఒక వారం రోజులు ముందే చనిపోయాడు అన్న సంగతి తెలుసుకున్నాడు  తరువాత బుద్ధుని మదిలో ఉద్దకరామ పుత్రుడు మెదిలాడు అతనికి ధర్మాన్ని బోధిస్తే చక్కగా స్వీకరిస్తాడు అని అనుకున్నాడు కానీ ఉద్ధకరామ పుత్రుడు ఒకరోజు ముందే మరణించాడు అని తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు  తాను ఒక చోట సాధనలో ఉన్నప్పుడు తనకు శుశ్రోష లు చేసి   తాను ఉపవాస దీక్ష విరమించగానే తాము సుఖాలకు అలవాటు పడ్డాడు అని నిరసన భావంతో తన నుంచి దూరమైన ఐదుగురు శ్రమణులు గుర్తుకొచ్చారు  బుద్ధునికి.
అప్పుడు వారు వారణాసిలోని ఇసి పట్టణంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు కొంతకాలం ఉరువేల లో గడిపిన బుద్ధుడు వారణాసి బయలుదేరారు సత్యాన్ని కనుకున్న బోది వృక్షంకు గయకు మధ్యలో ప్రయాణిస్తున్న బుద్ధునికి ఉపకుడు అనే శ్రమనుడు ఎదురై గౌరవనీయ నీ ఇంద్రియాలు శరీర కాంతి స్వచ్ఛంగా ఉన్నాయి మీరు ఎవరి వద్ద దీక్షలు పొందారు మీ కర్మ ఏది మీ ఆచార్యుడు ఎవరు అని అడిగాడు బుద్ధుడు ఆ శ్రమణులతో అన్నిటి నుంచి వియోగం పొందాను అన్నిటిని పరిత్యగించాను తృష్ణ ను పొందించి అంతా తెలుసుకున్నాను నేను అన్నిటిని జయించాను అనుకోకుండా నా అంతట నేను తెలుసుకున్నాను  నాకు ఆచార్యుడు ఎవరూ లేరు నేనే అర్హుతుoడను.
=====================================
సమన్వయం ; డా. . నీలం స్వాతి 
కామెంట్‌లు