కోరాడ బాల గేయాలు !
మాఊరి వరహాల గెడ్డ
       ******
బడి తోవలో గెడ్డ వాగులో
 కాగిత పడ వల పందాలు... 
 పిల్లలు బలే  హుషారు..! 
పెద్దల గుండెలు బేజారు..!! 

మా ఊరి వరహాల గెడ్డ అది
 మాఊరి మధ్య బడితోవలో
  అడ్డముగా...ఉన్న దది
  దొంగ గెడ్డ అని పేరున్నది ..! 

ఎపుడో....గానీ నీళ్లుండవు
ఊల్లో వర్షము పడినా ... 
 చిన్న గానే అది పారును.. 
  దూ రంగా  కని పించు
 బోడి కొండపై వాన కురిసెనా
పరవళ్ళుతొక్కుతూప్రవహించు

సన్నగా గెడ్డ పారుతున్నదా
 చిన్న పిల్లల పడవ పందాలు
 ప్రవాహమే వచ్చినదా.... 
  ఈతలుకొట్టేపసులకాపరులు

దారిన పోయే అందరికి... 
 అవి వినోద దృశ్యములు...! 
 గెడ్డ పొంగెనా...రాక,పోకలకు
 ఇబ్బందియని బ్రిట్జికట్టినారు

వర్షాకాలపు తొలి రోజులలోనే
  పిల్లలకాగిత పడవలపందాలు
   బడి పిల్లల ఆటల సరదాలు
   ఐనా పెద్దలగుండెలుబెజారు! 
       *******

కామెంట్‌లు