శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
951) ధాతా- 

విశ్వ ఆధారభూతుడై యున్నవాడు 
సూర్యునివంటి ప్రయోజకుడు 
విశ్వమును ధరించినట్టి వాడు 
లోకరక్షణము చేయుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
952)పుష్టహాసః -

మొగ్గలవలే వికసించువాడు 
పుష్పరూపంలో విచ్చుకొనువాడు 
ప్రపంచకుసుమము అయినవాడు 
పుష్టహాస నామధేయమున్నవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
953)ప్రజాగరః -

సదా మేల్కొనియుండినవాడు 
జాగరూకతతో మెలగువాడు 
ప్రజాగరుడయి యున్నట్టివాడు 
అప్రమత్తమై మెలుగుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
954)ఊర్థ్వ గః -

సర్వులకన్ననూ పైనుండినవాడు 
పీఠంనందు ఆశీనుడైనవాడు 
అగ్రస్థానము నందినట్టి వాడు 
సర్వోత్తమ స్థాయిలోనున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
955)సత్పథాచారః -

సత్పురుషులననుసరించువాడు 
సదాచార పరాయణుడైనవాడు 
సన్మార్గంలో నడుచుకొనువాడు 
సత్పథంలో చరించుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
(సశేషము )

కామెంట్‌లు